Homeఆంధ్రప్రదేశ్‌ఇబ్బంది పడుతున్న సచివాలయ సిబ్బంది?

ఇబ్బంది పడుతున్న సచివాలయ సిబ్బంది?

Sachivalayam staffపరిపాలనలో ఒక్కో నాయకుడిది ఒక్కో స్టైల్. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ, ఉచిత కరెంటు, చంద్రబాబుకు ప్రజల వద్దకుపాలన, జగన్ కు గ్రామ సచివాలయాలు ఇలా ఒక్కొక్కరిది ఒక్కో తీరుగా ఉంటుంది. దీంతో జనాలకు మంచి అభిప్రాయమే ఉంటుంది. పాలన సత్ఫలితాలు ఇస్తే సంతోషిస్తారు. లేదంటే తిట్టుకుంటారు. ఇదేం వ్యవస్థ అని దుమ్మెత్తి పోస్తారు. పథకాల సృష్టికర్తలుగా వారే మిగిలిపోతారు. ప్రజల్లో గుర్తింపు సైతం అదే రేంజ్ లో ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సందర్భంగా గ్రామసచివాలయ వ్యవస్థను ప్రజల ముందు చర్చకు పెట్టారు. ఆ ఊరి యువతకు అక్కడే ఉపాధి చూపిస్తామని భరోసా కల్పించారు. దీంతో యువత నమ్మకంతో ఓట్లువేశారు. ఫలితంగా అధికారం హస్తగతం చేసుకున్నారు. దీంతో రెండున్నర లక్షల మందిని వాలంటీర్లు, మరో లక్షన్నర మంది సచివాలయ సిబ్బందితో నాలుగు లక్షల మంది వరకు నిరుద్యోగులకు అవకాశం కల్పించారు. కానీ వారికి జీతాలు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో వారు అసంతృప్తితో ఉన్నారు.

రూ. లక్షల్లో వేతనాలు పొందే ప్రభుత్వ ఉద్యోగులు బద్దకస్తులైపోయారు. ఏ జీతాలులేని సచివాలయ ఉద్యోగులతో అన్ని పనులు చేయిస్తున్నారు. అన్ని శాఖలను సచివాలయంతో సమన్వయం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగులకు పని లేకుండా పోయింది. దీంతో సచివాలయ ఉద్యోగులకు ఇటు జీతాలు లేక అటు పనిభారం పెరిగి కదేలవుతున్నారు. పై నుంచి వచ్చే ఆదేశాలను సచివాలయాలకు బదలాయించి ప్రభుత్వ ఉద్యోగులు విశ్రాంతి తీసుకుంటున్నారు. దీంతో సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సచివాలయ వ్యవస్థ రెండేళ్లలో గాడి తప్పుతోందా అంటే నిజమే అనిపిస్తోంది. వార్డుల వరకే పరిమితం అయిన పనుు చేయడానికి సచివాలయ వ్యవస్థ రూపకల్పన చేశారు. కానీ అది గాడి తప్పింది. అన్ని శాఖల విభాగాలు వాడేసుకుని వారికి నయాపైసా ఇవ్వడం లేదు. దీంతో వారు నిరాశలో పడిపోయారు. పైసలు లేవుకాని పని మాత్రం ఉందని వాపోతున్నారు.జగన్ తీరుకు లోలోపలే తిట్టుకుంటున్నారు. ఇలాగైతే వ్యవస్థ ముందుకు పోవడం కష్టమని బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల బాగోగులు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version