AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ జుగుప్సాకరమైన విధంగా మారుతున్నాయి. జగన్ పాలన మొదలైయి రెండున్నరేండ్లు గడవగానే అప్పుడే రంజుగా సాగుతున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో వేడెక్కుతున్నాయి. ఇక మొన్న అసెంబ్లీ ఘటన తర్వాత దేశ రాజకీయాల్లోనూ హాట్ టాపిక్ అయ్యాయి ఏపీ రాజకీయాలు. ఇది మరువక ముందే ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. జగన్‌ను మర్డర్ చేసి అయనా సీఎం కావాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారని ఇద్దరు వైసీపీ నేతలు చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

ఒకవైపు చంద్రబాబు సెంటిమెంట్ రాజకీయాలను పండించే పనిలో భాగంగా నియోజకవర్గాల్లో సభలు పెట్టి తనకు జరిగిన అవమానం గురించి చెప్పాలనుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎక్కడ చంద్రబాబుకు సింపతీ పెరిగిపోతుందనే భయంతోనే వైసీపీ ఇలాంటి లేని పోని ఆరోపణలు చేస్తోందని వాపోతున్నారు తెలుగు తమ్ముళ్లు. కానీ రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఈ ఆరోపణల చేశారు. అయితే వీరిద్దరూ వారంతట వారే చేశారనే ఆరోపణలకు ఆస్కారం లేదు.
ఎందుకంటే ఇలాంటి పెద్ద ఆరోపణలు చేయాలంటే కచ్చింతగా పార్టీ పెద్దల నుంచే ఆ ఆలోచన పుట్టాలని చెబుతున్నారు విశ్లేషకులు. అంటే ఈ ఆరోపణలు అన్నీ వ్యూహాత్మకంగానే జరుగుతున్నాయనే అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. ఇక వీరి ఆరోపణలకు టీడీపీ తమ్ముళ్లు, నేతలు గట్టిగానే కౌంటర్ వేస్తున్నారు. గతంలో చేసినట్టే కోడికత్తి, లేదంటే గొడ్డలిపోటు లాంటివి ఏవో తామంతట తామే ప్లాన్ చేసుకుంటున్నారని ఇది వారికి బాగా అలవాటు అయిపోయందంటూ ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు.
Also Read: Padayatra: తుది అంకానికి చేరుకున్న ‘మహాపాదయాత్ర’.. ఉత్కంఠ?
ఇక్కడే టీడీపీ నేతలు ఇంకో ప్రశ్న కూడా సంధిస్తున్నారు. అదేంటంటే.. చంద్రబాబుకు అలాంటి ఆలోచన ఉంటే.. ఆయన అధికారంలో ఉన్న ఐదేండ్లు జగన్ అంత ప్రశాంతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా తిరగారంటూ అడుగుతున్నారు. ఇలా వైసీపీ ఆరోపణలకు టీడీపీ కౌంటర్లు నడుస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలు కాస్తా సాధారణ రాజకీయాల నుంచి హత్యా రాజకీయాల వైపు దారి తీస్తున్నాయంటూ చెబుతున్నారు విశ్లేషకులు.
Also Read: ABN Radhakrishna: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను జగన్ బుక్ చేసినట్టేనా?