https://oktelugu.com/

AP Politics: ఏపీ రాజకీయాలకు కోర్టులే వేదిక

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో.. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించేవారు.భూ కేటాయింపులు,మంత్రివర్గ ఆమోదంలో కుండా చేసే నిర్ణయాలపై కోర్టుకు వెళ్లేవారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 24, 2023 / 11:30 AM IST

    AP Politics

    Follow us on

    AP Politics: ఏపీ రాజకీయాలన్నీ కోర్టుల చుట్టే తిరుగుతున్నాయి. గత ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ ప్రస్తుత ప్రభుత్వం.. ప్రభుత్వ విధానాలను తప్పుపడుతూ ప్రతిపక్ష నేతలు.. చివరికి ఉద్యోగాల నోటిఫికేషన్లపై సైతం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. ఏపీ పరువును మంటగలుపుతున్నారు. కోర్టుల విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారు.ఒక విధంగా చెప్పాలంటే ఏపీలో పాలనను కోర్టులే నడుపుతున్నాయనిజాతీయస్థాయిలో చర్చకు కారణం అవుతున్నారు.

    తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో.. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై ఆళ్ల రామకృష్ణారెడ్డి లాంటి నేతలు న్యాయస్థానాలను ఆశ్రయించేవారు.భూ కేటాయింపులు,మంత్రివర్గ ఆమోదంలో కుండా చేసే నిర్ణయాలపై కోర్టుకు వెళ్లేవారు. ఒకరకంగా చెప్పాలంటే అప్పట్లో కేసులకు వెళ్లి అడ్డుకోవడం అరుదు.కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలపై కోర్టులను ఆశ్రయించడం పెరిగిపోయింది.ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా.. ఏ పాలసీని ప్రకటించినా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కోర్టును ఆశ్రయించడం పరిపాటిగా మారింది. వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం ఇష్టారాజ్యంగా కోర్టులో పిటిషన్ వేసిన సందర్భాలు కనిపిస్తున్నాయి.

    ఒకానొక దశలో వైసిపి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాలపై కోర్టుల ప్రభావం అధికంగా ఉండేది. చాలా పథకాల విషయంలో సైతం ప్రతికూల తీర్పులు వచ్చాయి. విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో అటు ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోకపోగా..ఇటు విపక్షాలు సైతం బాధ్యతాయుతంగా వ్యవహరించకపోవడంతోఏపీ విషయంలో కోర్టులో పిటిషన్లు పెరిగిపోయాయి. న్యాయస్థానాల జోక్యం అనివార్యంగా మారింది. ఈ విషయంలో ఎల్లో మీడియా వాదన కూడా వింతగా ఉండేది. చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంటే ఒప్పు.. జగన్ సర్కార్ తీసుకుంటే తప్పు అన్న కోణంలోఎల్లో మీడియా వ్యవహరిస్తూ వచ్చింది. ప్రజా ప్రయోజనాల పిటిషన్ల వెనుక రాజకీయం దాగి ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే కొన్ని రకాలైన ప్రభుత్వ నిర్ణయాలపై కూడా కోర్టులో కేసులు ప్రతిబంధకంగా మారాయి.

    చాలా సందర్భాల్లో ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆ పరిస్థితి వచ్చిందని ఎల్లో మీడియా ప్రచారం చేసింది. అందుకు తగ్గట్టుగానే ఒక సీన్ క్రియేట్ చేయాలని చూశారు. వరుసుగా కోర్టు కేసులతో జగన్ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రయత్నించారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో కోర్టులే రాజకీయ వేదికగా మారిపోయాయని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి కాదు. చాలా రకాల నిర్ణయాలపై, ప్రభుత్వ పాలసీలపై కోర్టులను ఆశ్రయించారు. కొన్నిసార్లు అడ్డుకోగలిగారు. దానినే ప్రతిపక్షాల విజయంగా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు అదే న్యాయస్థానాల్లో తమకు చుక్కెదురు కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.చట్టం, న్యాయం అందరి దృష్టిలో ఒకటేనన్న విషయాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.