SS Rajamouli First Movie: దేశం గర్వించదగ్గ డైరెక్టర్ రాజమౌళి గురించి ఏ చిన్న విషయం అయినా ఇట్టే వైరల్ అయిపోతుంది. అయితే రాజమౌళి మొదటి సినిమా ఏది అంటే అందరికీ వెంటనే గుర్తుకు వచ్చేది స్టూడెంట్ నెంబర్ వన్. తడబడకుండా అందరూ చెప్పే మాట ఇదే కదా.. కాదు అంటే చస్ మీకేం తెలుసు అంటారు. ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి తీసిన సినిమా ఇది అని బల్ల గుద్ది మరీ చెబుతారు. అయితే ఎవరికీ తెలియని విషయం ఒకటుంది. రాజమౌళి మొదటి సినిమా అసలు విడుదల కాలేదు.
వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. అపజయం అంటూ ఎరుగని డైరెక్టర్.. తీసిన ప్రతి సినిమాతో చరిత్ర లిఖించే దర్శకధీరుడు అయిన రాజమౌళి సినిమా ఆగిపోవడం ఏంటి.. అని మీరు నోరెళ్ళ పెడుతున్నారు కదా. కానీ మీరు విన్నది నిజమే. ఈ విషయాన్ని స్వయంగా డైరెక్టర్ రాజమౌళి చెప్పాడు. త్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ లో భాగంగా.. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ ఇంటర్వ్యూ ల మీద ఇంటర్వ్యూ లు ఇస్తున్న జక్కన్న ఇందులో భాగంగా ఈ విషయాన్ని వివరించాడు.
Also Read: Interesting Facts About Oscar Awards: ‘ఆస్కార్ అవార్డ్’ దేనితో తయారు చేస్తారు ? దాని విలువ ఎంత ?
భల్లాల దేవుడు రానా ముంబైలోని తన ఇంట్లో త్రిబుల్ ఆర్ టీంతో ఓ ఇంటర్వ్యూ చేశాడు. ఇందులో భాగంగా ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్టీఆర్, చరణ్ గురించి ఏం తెలుసుకున్నారని రాజమౌళిని అడిగాడు రానా. కాగా వీరిద్దరికీ కెరియర్ మొదట్లో కథల ఎంపికలో క్లారిటీ ఉండేది కాదని.. కానీ ఇప్పుడు ఇద్దరికీ కథల ఎంపిక పై మంచి పట్టు ఉందని చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఈ క్రమంలోనే ఎవరు సీరియర్ ఎవరు జూనియర్ అనే టాపిక్ ను తెచ్చాడు రానా.
వాస్తవంగా వీరు ముగ్గురూ దగ్గర దగ్గరలోనే కెరీర్ ను స్టార్ట్ చేశారు. ఇదే విషయాన్ని రాజమౌళి మాట్లాడుతుంటే.. మధ్యలో తారక్ కలగ చేసుకొని తాను 1991 లోనే తాత గారి సినిమాలో యాక్ట్ చేశాను అని చెప్పుకొచ్చాడు. అలా అంటే తాను 1983లోనే ఓ సినిమాలో నటించానని కానీ ఆ సినిమా విడుదల కాలేదని రాజమౌళి చెప్పుకొచ్చాడు. ఆ సినిమా పేరు పిల్లనగ్రోవి అంటూ వివరించాడు. అంటే రాజమౌళి చేసిన మొదటి సినిమా ఇదేనన్నమాట.
Also Read: Tollywood Best Multi Starrers: టాలీవుడ్ లో వచ్చిన టాప్ 10 మల్టీస్టారర్ సినిమాలు ఇవే..
Recommended Video: