YSRCP Plenary 2022: వైసీపీ ప్లీనరీ ముగిసింది. జగన్ తాను చెప్పదలచుకున్నది చెప్పేశారు. నేను ఏం చేసినా ప్రజల కోసమేనని చెప్పుకొచ్చారు. కానీ వచ్చే ఎన్నికలకు వైసీపీ శ్రేణులకు దిశానిర్దేశం మాట అటుంచితే… జగన్ తానో కొత్త లోకంలో ఉన్నట్టు మాత్రం ఆయన మాటలు చెబుతున్నాయి. రాష్ట్రానికి అన్నీ చేశానని.. ఇక ఏమీ మిగల్లేవు అన్నట్టు ఆయన ప్రసంగాలు సాగావి. అయితే అధినేత ప్రసంగంలో కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తారని భావించిన వైసీపీ శ్రేణులను మాత్రం అధినేత మాటలు గందరగోళంలో నెట్టేశాయి. తాము అధినేత నోటి నుంచి కొన్ని మాటలు వస్తాయని ఊహించామని.. కానీ అంటూ ఎక్కువమంది అసంత్రుప్తి వ్యక్తం చేశారు. ప్లీనరీలో ప్రారంభ, ముగింపు సందర్భంగా జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. అయితే తన ప్రసంగంలో తన తండ్రి వైఎస్ఆర్ ప్రస్తావన అంతంతమాత్రమే. పదేపదే చంద్రబాబు ప్రస్తావనే తీసుకొచ్చారు. అతడి హయాంలో అన్ని ఫెయిల్యూర్స్ గా చూపించారు. తన హయాంలో మాత్రం ఎన్నడూ లేని అభివ్రుద్ధి జరిగిందని నమ్మించే ప్రయత్నం చేశారు. తాను చేసింది నమ్మితేనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయండని కూడా ప్రజలకు సూచించారు. ప్రజలు కూడా నమ్మాలని సూచనలిచ్చారు. గత మేనిఫెస్టోలో పొందుపరచిన హామీలు అమలుచేసినందున ఓటు అడిగే హక్కు తనకే ఉందని కూడా బదులిచ్చారు.

చంద్రబాబు ఫెయిల్..
అన్ని తప్పిదాలకు చంద్రబాబే కారణమన్నారు. అతడి హయాంలో అభివ్రుద్ధి చేయకపోగా.. తాను చేస్తున్నా అడ్డుతగులుతున్నారని కూడా కొత్త పల్లవి అందుకున్నారు. కోనసీమ అల్లర్లకు బాధ్యులైన వారిని పోలీసులు అరెస్ట్ చేయడానికి ప్రయత్నించగా చంద్రబాబు, పవన్ అడ్డుకోవడానికి ప్రయత్నించారని కూడా విమర్శించారు. వైసీపీ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దివాళాదిశగా ప్రయత్నిస్తోందని.. శ్రీలకం మాదిరిగా తయారవుతుందని చంద్రబాబు పచ్చ మీడియా ద్వారా ప్రచారం చేయడంపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలో శ్రీలంకగా మారితే.. చంద్రబాబు హయాంలో రాష్ట్రం అమెరికా దిశగా పయనించిందా అని ప్రశ్నించారు. తాను చేసిన అప్పుల కంటే చంద్రబాబే ఎక్కువ చేశారని కూడా ప్రకటించారు. ఆయన కంటే తానే మంచి రోడ్లు వేసినట్టు గుర్తుచేశారు. తన హయాంలోనే ఆరోగ్య శ్రీ చక్కగా పనిచేస్తోందన్నారు. ప్రజలకు విద్య, వైద్యంతో పాటు మౌలిక వసతులు కల్పించగలిగనని కూడా ప్రకటించారు. ఇవన్నీ మీరు నమ్మాల్సిందేనని.. తప్పుడు ప్రచారాలను మాత్రం నమ్మవద్దని విన్నవించారు. తన సుపరిపాలనను నమ్మి తనకు మరో అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు.
Also Read: Ethanol Fuel:5 ఏళ్లలో దేశంలో పెట్రోల్ వాహనాలు ఉండవు.. కేంద్రం మరో సంచలనానికి తెరతీస్తోందా?
వాటి ప్రస్తావన లేదు..
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రజలకు నగదు బదిలీ జరిగిందని చెప్పుకొచ్చిన జగన్ .. అందుకు ఎక్కడి నుంచి నిధులు సమకూర్చుతున్నది అన్నది మాత్రం తెలియపరచలేదు. పన్నులు, చార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చిందో స్పష్టతనివ్వలేదు. లక్షల కోట్లు వివిధ సంక్షేమ పథకాలకు కేటాయించానని మాత్రమే చెప్పుకొచ్చారు. గొప్పగా చెప్పుకునేందుకు ప్రయత్నించారు. కానీ ఆ సొమ్మంత ప్రజల దగ్గర వసూలు చేస్తున్న విషయాన్ని మాత్రం మరిచిపోయారు.

అటు వివిధ కార్పొరేషన్ల పేరిట చేసిన అప్పులు, భవిష్యత్ ఆదాయాన్ని కుదువపెట్టి తెస్తున్న రుణాలపై సైతం క్లారిటీ ఇవ్వలేదు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం వీటన్నింటిపై అధినేత స్పష్టతనిచ్చి విమర్శలకు చెక్ చెబుతారని భావించారు. క్షేత్రస్థాయిలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై ప్రజల నుంచి ప్రశ్నలు, నిలదీతలను ఎదుర్కొంటున్నారు. సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. అటువంటి వారి నోటికి తాళం వేసేలా జగన్ ప్రసంగం ఉంటుందని భావించారు. అయితే తనకు ఎప్పుడూ అలవాటు పద్ధతినే జగన్ మరోసారి చేసి చూపించారు. తాను ప్రజలకు ఇస్తున్న వాటి గురించే ప్రస్తావించారు. కానీ ఎక్కడ నుంచి ఏ విధంగా తెస్తున్నది మాత్రం కనీస ప్రస్తావన చేయలేదు. అధినేత మరో లోకంలో ఉన్నారని..అటువంటప్పుడు ఆయన నోటి నుంచి కొన్నింటిని ఊహించడం అతిశయోక్తిగా మారుతుందని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి.
Also Read:Sri Lanka Crisis 2022: సండే స్పెషల్: లంకా దహనానికి ఆ నలుగురే కారణమా?
[…] […]
[…] […]