JanaSena- YCP Leaders: ఏపీ సీఎం జగన్ పాలనంతటిని తన గుప్పెట్లో పెట్టుకున్నారు. అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీ వ్యవహారాలను తన సొంత సామాజికవర్గం నేతలు ముగ్గురు, నలుగురికి అప్పగించారు. మంత్రులు.. పేరుకే పదవులు తప్ప విధులు లేవు.. నిధులు లేవు. ఎవరికైనా పని చేసి పెట్టాలన్న సాధ్యపడడం లేదు. పైగా మూడు, నాలుగు జిల్లాలకు ఒక రెడ్డి సామాజికవర్గం నాయకుడి పెత్తనం. ఏపనిచేయాలన్నా.. చివరకు ప్రెస్ మీట్ పెట్టాలన్న వారి అనుమతి తీసుకోవాల్సిందే. అయితే ఈ చర్యలతో విసిగి వేశారిపోయిన అధికార పార్టీ నాయకులు తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. చేతిలో పవర్ ఉంది కానీ దానిని కూడా కట్టడి చేశారు. నిధులు కూడా అప్పగించడం లేదు. అటు సంక్షేమ పథకాల అమలుతో సీఎం జగన్ కే క్రెడిట్ దక్కుతుంది కానీ నియోజకవర్గాల్లో తమ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందన్న బాధ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది.

అటు క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళుతుంటే వ్యతిరేకత కనిపిస్తోంది. ఇటు సీఎం నా గ్రాఫ్ బాగుంది. నేనుబటన్ నొక్కుతున్నాను. మీరు ప్రజల్లోకి వెళ్లండని ఆదేశిస్తున్నారు. మీ జాతకాలు నా వద్దే ఉన్నాయని.. పనిచేయని వారిని మార్చేస్తానని కూడా జగన్ అల్టిమేట్ ఇస్తున్నారు. అందుకే విసిగి వేశారి పోయిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు కొందరు పక్క చూపులు చూడడం ప్రారంభించారు. టీడీపీలో ఖాళీలు లేవు. దీంతో అల్ట్రనేషన్ గా ఉన్న జనసేన వైపు వారిచూపు పడింది. ఇంకేముంది కొందరు టచ్ లోకి వెళ్లిపోతున్నారు. కొందరు పరోక్ష మద్దతు తెలుపుతున్నారు. ఇంకా 17 నెలల పాటు అధికారం ఉంది కాబట్టి ఇక్కడే కొనసాగుతున్నారు. భౌతికంగా వైసీపీలో ఉన్నా వారి మనసు మాత్రం జనసైన వైపే ఉంది. ప్రస్తుతానికి వైసీపీలో ఉన్నా నియోజకవర్గాల్లో జనసేన బలపడడాని పరోక్షంగా సహకారమందిస్తున్నారన్న టాక్ నడుస్తోంది.
Also Read: Visakha Railway Zone: విశాఖ రైల్వే జోన్ పాయె…కేంద్రం మోసం.. వైసీపీ ఇప్పుడు ఏం చేస్తుంది?
అయితే పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో పనిచేస్తున్న చాలా మందికి ప్రధాన్యత దక్కలేదు. అటువంటి వారు వైసీపీలో చేరుతున్నారు. ఇటువంటి జాబితా ఉభయగోదావరి జిల్లాల్లో అధికంగా ఉంది. ఇప్పటికే రాజోలు వైసీపీ నాయకుడు బొంతు రాజేశ్వరరావు చేరిక దాదాపుఖాయమైంది. విశాఖ నుంచి ఎం.రాఘవరావు చేరారు. గుంటూరు నుంచి రెడ్డి సామాజికవర్గనేత జనసేనలో జాయిన్ అయ్యారు. పవన్ బస్సు యాత్ర సమయంలో మాత్రం భారీగా చేరికలు ఉంటాయని జనసేన నేతలు అంచనా వేస్తున్నారు. అటు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం పార్టీపై ఏమంత సదాభిప్రాయంతో లేరు. పార్టీ కోసం కష్టించి పనిచేస్తే అధిష్టానం తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఎమ్మెల్యే స్థాయి వరకూ పర్వాలేకున్నా.. ద్వితీయ శ్రేణి నాయకులు చేపట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులకు సంబంధించి బిల్లులు కూడా చెల్లించడంలేదు. దీంతో వారంతా పార్టీపై కోపంతో ఉన్నారు. జనసేనను ప్రత్యామ్నాయ రాజకీయ వేదిగా చూసుకుంటున్నారు.

పోనీ టీడీపీలోకి వెళతామంటే ఆ పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. చంద్రబాబు ఇదివరకులా యాక్టివ్ గా పనిచేయలేకపోతున్నారు. పైగా ఇప్పటికే అక్కడ సీనియర్లు ఉన్నారు. దశాబ్దాల తరబడి నియోజకవర్గాల్లో పాతకుపోయారు. ఇటువంటి పరిస్థితిలో టీడీపీలో జాయిన్ కావడం వెస్ట్ అన్న భావనకు వచ్చారు. జనసేనఅయితే అన్నివిధాలా బాగుంటుందన్న ఆలోచనకు వచ్చారు. పైగా ప్రస్తుతం జనసేన గ్రాఫ్ పెరిగిందన్న వార్తలు కూడా వారిలో మార్పునకు కారణాలవుతున్నాయి. నియోజకవర్గ స్థాయి నేతలుగా ఎదగాలనుకుంటున్న వారంతా ఇప్పుడు జనసేన వైపే చూస్తున్నారు.
[…] […]
[…] […]