AP Politics: ఏపీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రం విడిపోయిన తరువాత కొంత స్తబ్ధంగా ఉన్న రాజకీయాలు కొన్నాళ్లుగా ఒక్కసారిగా హీటెక్కాయి. ఇంతకాలం సింగిల్ పార్టీ పాలిటిక్స్ అనుకున్న ఏపీలో త్రిముఖ పోరు మళ్లీ తెరపైకి వచ్చేలా కనిపిస్తోంది. భారీ ఓటమితో చతికిలపడిన టీడీపీ మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. కొన్నాళ్లుగా సైలెంట్ గా ఉన్న జనసేన మళ్లీ గాడిన పడుతోంది. పవన్ కల్యాణ్ వివిధ రాజకీయాస్త్రాలు సంధిస్తూ.. జగన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఏపీ సీఎం జగన్ అంచనాలు కూడా తక్కువేమీ ఉండవు. సైలెంట్ గా పని కానిచ్చేస్తాడు జగన్. తాన వ్యూహం మూడోకంటికి కూడా తెలియకుండా రాజకీయ చదరంగం ఆడేస్తుంటాడు. ఇదే క్రమంలో పార్టీలో ప్రక్షాళన ప్రారంభించారని తెలుస్తోంది. ఇదీ.. అతడికి లాభమా..? నష్టమా అనే కోణంలో రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం కులపోరు జోరుగా సాగుతోంది. పార్టీల కన్నా కులాలకే పెద్దపీఠ వేస్తున్నారన్న ప్రచారం ఏపీలో ఎక్కువే. ఇతర కులాలవారు ఏళ్లకాలంగా పార్టీకోసం అహర్నిషలు కృషిచేస్తే తమకు అనుకూలంగా ఉన్నవారికే కుల మద్దతు ఉంటుంది. దీంతో ప్రస్తుతం అన్ని రాజకీయపార్టీలు ఏపీలో కుల ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో జనసేన, టీడీపీ సైతం ఇదే ఆలోచనకు రాగా.. జగన్ కూడా ఆ రెండు పార్టీల కులరాజకీయాలతో తమకు కలిగే నష్టం ఏం లేదని చెబుతున్నారు. ఇప్పటికే జగన్ టీడీపీని కోలుకోలేని దెబ్బతీశారు. గత ఎన్నికల్లో కమ్మ.. నాన్ కమ్మ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లిన జగన్ సఫలమయ్యారు. ప్రశాంత్ కిశోర్ సలహాతో ఏపీలో భారీ విజయం సాధించారు. ప్రస్తుతం మరోసారి అదే అస్ర్తాన్ని వాడుతున్నారు. కమ్మ..కాపు ఏకమై.. తనను ఓడించాలని చూస్తున్నారని జగన్ ఇప్పటికే తన అనుచరులతో ప్రచారం చేయిస్తున్నారు.
Also Read: Pawan Kalyan: పవన్ మైండ్ ను మార్చేశారా?
అయితే పవన్ కల్యాణ్ ఏ కులాన్ని ఇప్పటివరకు సపోర్టు చేయలేదు. తన కులాన్ని కూడా ఆయన ఏనాడూ.. వెనకేసుకు రాలేదు. ఇటీవల రాజమండ్రి కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు చాలామందిని ఆలోచనలో పడేసింది. పవన్ కల్యాణ్ ఎలాంటి కులాపేక్ష లేకుండా ముందుకు సాగుతుంటారు. అయితే ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో పవన్ కల్యాణ్ ప్రజల్లోకి వెళ్తున్నారనేది విశ్లేషణ. అయితే జగన్ మాత్రం దీన్ని అస్ర్తం వాడుకోవాలని చూస్తున్నారు. టీడీపీ జనసేన ఒక్కటైతే.. కుల రాజకీయాలను మరోసారి తెరపైకి తెచ్చి వచ్చే ఎన్నికల్లోనూ విజయం సాధించాలని చూస్తుండగా.. ఇప్పటికే పవన్ కల్యాణ్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజలు దగ్గరవుతున్న క్రమంలో వైసీపీ డైలామాలో పడింది.
Also Read: TPCC Revanth Reddy: రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ ఇచ్చిందా?