ఏపీ కంటే తెలంగాణలో మద్యం రేట్లు చాలా తక్కువ. ఏపీలో కొన్ని బ్రాండ్లపై నిషేధం ఉండగా తెలంగాణలో అన్నిరకాల బ్రాండ్లు లభ్యమవుతున్నాయి. దీంతో ఏపీ నుంచి మద్యంబాబులు తెలంగాణ సరిహద్దు గ్రామాలకు తరలివస్తున్నారు. కొందరు ఈ ప్రాంతాల్లో మద్యం సేవించి వెళ్తుండగా మరికొందరు ఇదే అదునుగా భావించి భారీ ఎత్తున మద్యాన్ని ఏపీకి తరలిస్తున్నారు. మద్యం అమ్మకాలపై ఏపీలో ఆంక్షలు ఉండటం.. తెలంగాణ నుంచి భారీ ఎత్తున ఏపీలోకి మద్యం వస్తుండటంతో ఏపీ పోలీసులు దీనిపై దృష్టిసారించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులకు సమాచారం అందించకుండా సరిహద్దు గ్రామాల్లో ఏపీ పోలీసులు సోదా చేపట్టడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీకి కూతవేటులోనే జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని పుల్లూరు గ్రామం ఉంది. కర్నూలుకు చేరువలో ఉండే ఈ గ్రామంలో మద్యం విక్రయిస్తున్నారనే కారణంతో ఏపీకి చెందిన స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం సోదాలు చేపట్టింది. వీరిని తెలంగాణ పోలీసులుగా స్థానికులు భావించి తొలుత సహకరించారు. ఆ తర్వాత ఏపీ పోలీసులుగా గుర్తించిన ప్రజలు ఏపీ పోలీసుల జీపును చుట్టుముట్టి తెలంగాణ పోలీసులకు సమాచారం అందించారు.
తెలంగాణ పోలీసులు వీరిని ప్రశ్నింగా పొంతనలేని సమాధానం చెప్పారు. ఈ గ్రామంలోని లిక్కర్ షాపులకు నోటీసులు ఇవ్వడానికి వచ్చామని ఒకసారి.. ఈ ప్రాంతంలో నేరస్థులు దాక్కున్నారని మరోసారి సమాధానం చెప్పారు. దీనిపై తెలంగాణ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పొరుగు రాష్ట్ర పోలీసులు ఎలా వస్తారని ప్రశ్నించారు. తెలంగాణలో సోదాలు చేసేందుకు ఏపీ పోలీసులకు అధికారం లేకున్నప్పటికీ ఇలా చేయడంపై స్థానకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారుల నుంచి తెలంగాణ పోలీసులు వివరణ కోరినట్లు తెలుస్తోంది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Ap policemen searches in telangana border villages
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com