Homeఆంధ్రప్రదేశ్‌ఏపీ జనాలకు జగన్ కన్నా మోదీ పైనే నమ్మకం ఎక్కువా..? 

ఏపీ జనాలకు జగన్ కన్నా మోదీ పైనే నమ్మకం ఎక్కువా..? 

PM Modi Dials AP CM YS Jagan, Enquires About COVID Centre Mishap

కొద్ది రోజుల క్రితం ఏపీలో తూర్పుగోదావరి జిల్లా సీతానగరం లో శిరోముండనం ఘటన జరిగినప్పుడు బాధితుడు పోలీసుల వద్ద, రాష్ట్ర ప్రభుత్వం వద్ద న్యాయం జరగక రాష్ట్రపతిని ఆశ్రయించిన విషయం తెలిసిందే. రామ్ నాథ్ కోవింద్ కూడా అందుకు తగినట్లు స్పందించి అతనికి అన్ని విధాలా సాయపడ్డారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ఒక కంప్లైంట్ ప్రధాని నరేంద్ర మోడీ టేబుల్ వరకు వెళ్ళింది.

విషయం ఏమిటంటే…. తెలంగాణలో ఇప్పటి వరకు ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా బాధితులను నిట్టనిలువునా దోచుకుంటున్న ఉదంతాలు ఎన్నో చూశాం. దీనిపై తెలంగాణ హైకోర్టు తో పాటు తెలంగాణ గవర్నర్ తమిళ సై కూడా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని చేసినా టిఆర్ఎస్ ప్రభుత్వం తీరు మారలేదు అనుకోండి అది వేరే విషయం… అయితే ఇక్కడ సంగతి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రైవేటు ఆసుపత్రులు మేమేమీ పక్క రాష్ట్రం వారికి తక్కువ కాదు అన్న రీతిలో ప్రజలను దోచేసుకుంటున్నాయట.

ఇక కంప్లైంట్ ఇచ్చినా కూడా జగన్ ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవడంలో చూపిస్తున్న అలసత్వం వల్ల చిరాకు చెందిన ఒక వ్యక్తి ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారు. ఏలూరు కి చెందిన వంశీకృష్ణ తనతోపాటు మరో 13 కుటుంబాల దగ్గర ఒక ప్రైవేటు ఆసుపత్రి కరోనా వైద్యం పేరుతో తమ వద్ద అధిక మొత్తాన్ని వసూలు చేశారని కంప్లైంట్ రాశారు. దీనికి వెంటనే వంశీకృష్ణకు పీఎం ఆఫీస్ నుండి సమాధానం కూడా వచ్చేసింది. ఇక ప్రధానమంత్రి ఆఫీస్ వారు ఈ విషయాన్ని తక్షణమే విచారించమని రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ అఫీషియల్ జనార్ధన్ కు తెలియజేసినట్లు సమాచారం.

వంశీకృష్ణ పీఎం కు రాసిన లేఖలో ఏలూరులోని మురళీకృష్ణ ఆసుపత్రి వారు ఇప్పటివరకు 13 కుటుంబాలకు నాలుగు లక్షల నుండి 14 లక్షల వరకు ఫీజులు వసూలు చేశారని…. పైగా వైద్యం కూడా సరిగ్గా అందించలేకపోయారు అని కంప్లైంట్ చేశారు. తనకు ఇక్కడా న్యాయం జరుగకపోతే ఇక కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందని చెప్పారు. అయితే అంత అవసరం లేకుండా ప్రధానమంత్రి ఆఫీస్ వెంటనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర హెల్త్ అథారిటీ లకు ఈ విషయాన్ని చేరవేసి వెంటనే దీనిపై స్పందించాలని ఆదేశించారు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

1 COMMENT

Comments are closed.

RELATED ARTICLES

Most Popular