
మాటలు మాట్లాడటం చాలా సులభం. ప్రతి ఒక్కరూ తాను కలెక్టర్ అవుతానని, ఇంజనీర్ అవుతానని మాటలు చెబుతూ ఉంటారు. అయితే చెప్పిన మాటలను నిజం చేయడం అంత సులభం కాదు. ఎంతో శ్రమిస్తే మాత్రమే ఏ పనిలోనైనా అనుకున్న ఫలితాలను సాధించడం సాధ్యమవుతుంది. ఏపీ సీఎం జగన్ కూడా తాను మాట తప్పనని.. మడమ తిప్పనని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఆయన పాలనను గమనిస్తున్న ఏపీ ప్రజానికం మాత్రం ఆయన మాట తప్పుతారని కామెంట్లు చేస్తున్నారు.
Also Read : ఏపీ పరువును గంగలో కలుపుతున్న టీడీపీ వైసీపీ నేతలు?
గత కొన్ని నెలలుగా చంద్రబాబు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్న వాసుపల్లి గణేష్ ఎట్టకేలకు పార్టీని వీడి వైసీపీకి తన మద్దతు ప్రకటించారు. ఆయన తెలివిగా తన కొడుకులిద్దరినీ వైసీపీలో చేర్పించి జగన్ సర్కార్ ను పొగడ్తలతో ముంచెత్తారు. ఏపీకి విశాఖను జగన్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించడంతో విశాఖ నేతలు వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే జగన్ గతంలో చెప్పిన మాటలు ఇప్పుడు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.
సీఎం జగన్ గతంలో టీడీపీ వైసీపీ నేతలను చేర్చుకున్న విధంగా వైసీపీ చేర్చుకోదని… ఎవరైనా పార్టీలోకి రావాలంటి రాజీనామా చేసి మాత్రమే రావాలని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు మాత్రం టీడీపీని వీడిన నేతలు వైసీపీకి మద్దతు పలికేలా చేస్తూ జగన్ కొత్త సాంప్రదాయానికి తెర లేపుతున్నారు. ఇప్పటివరకు వైసీపీకి మద్దతు ప్రకటించిన టీడీపీ నేతలలో ఒక్కరు కూడా తమ పదవులకు రాజీనామా చేయలేదు.
అదే సమయంలో స్పీకర్ అనర్హత వేటు వేయకుండా వైసీపీ చర్యలు తీసుకుంటోంది. దీంతో ప్రజలు జగన్ మాట తప్పుతున్నారు… మడమ తిప్పుతున్నారు అనే కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో టీడీపీకి, వైసీపీకి పెద్దగా తేడా లేదని ప్రత్యక్షంగా నేతలను పార్టీలో చేర్చుకోకుండా వైసీపీ కొత్త విధానాలను అవలంబిస్తోందని ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకోవడం వల్ల వైసీపీకే నష్టమని కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.
Also Read : విపక్షాల సంచలనం.. డిప్యూటీ చైర్మన్ పై అవిశ్వాసం