
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల జోరు నడుస్తోంది. ఇప్పటికే తొలి విడత ఎన్నికలు ముగిశాయి. పార్టీలకు, పంచాయతీ ఎన్నికలకు ఎలాంటి సంబంధం లేకున్నా.. ఈ ఎన్నికలను ప్రతీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటుంటుంది. తమ ఈమేజీని చాటాలని ప్రయత్నిస్తుంటాయి. తమ పార్టీ మద్దతు ఇచ్చిన వారే గెలవాలని ఆరాటపడుతుంటాయి. అయితే.. ఇప్పటికే రాష్ట్రంలో ఎస్‌ఈసీ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా యుద్ధం నడుస్తోంది.
Also Read: షర్మిల పార్టీపై వ్యూహాత్మక అటాక్
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మెజార్టీ గ్రామపంచాయతీలను ఏకగ్రీవం చేయాలని ప్రభుత్వం ఆరాటపడుతోంది. అదే సమయంలో ఏకగ్రీవాలకు బ్రేక్‌లు వేయాలని ఎస్‌ఈసీ, ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయి. అందుకే.. కౌంటింగ్ సమయంలోనూ పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులే కనిపించాయి.
కానీ.. చివరికి ఫలితాల్లో అధికార పార్టీ మద్దతుదారుల హవానే కనిపించింది. ఓవరాల్‌గా వైసీపీ మద్దతుదారులు 2,336 మంది విజయం సాధించగా.. టీడీపీ మద్దతుదారులు 503 చోట్ల గెలుపొందారు. బీజేపీ జనసేన కూటమి, ఇతర పార్టీలు 47 స్థానాలతో సరిపెట్టుకున్నాయి. ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ 72 మంది విజయం సాధించారు. గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖల్లో మాత్రం ప్రధాన ప్రతిపక్షం 50 సీట్లకు పైగా సాధించి రేసులో నిలిచింది. మిగిలిన అన్ని చోట్ల కనీసం అధికార పార్టీకి పోటీ ఇవ్వలేకపోయింది.
Also Read: తొక్కిపడేస్తా.. గ్యాప్ ఇచ్చినా తగ్గని కేసీఆర్
మొదటి విడత పంచాయతీ పోరులో ఓవారల్‌గా చూస్తే సైకిల్ ప్రభావం నామమాత్రంగానే కనిపించింది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సొంత ఊరు నిమ్మాడలో జరిగిన ఎన్నిక చాలా ఆసక్తి పెంచింది. 40 ఏళ్ల తరువాత ఇక్కడ ఎన్నికలు జరిగ్గా టీడీపీ అభ్యర్థి కింజారపు సురేష్ 1700 ఓట్లతో విజయం సాధించారు. మూడు, నాలుగు జిల్లాలు మినహా అన్నింటా 75 శాతానికి పైగా విజయాలు అధికారపార్టీ ఖాతాలోనే పడ్డాయి.
ఇక ఎన్నిక ఏదైనా జీరోతో సరిపెట్టుకుంటూ వస్తున్న కాంగ్రెస్ ఎట్టకేలకు బోణీ చేసింది. ఏపీ పంచాయతీ తొలి విడత ఎన్నికల ఫలితాల్లో ఒక సీటును సొంతం చేసుకుంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని చిలుకూరు పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారు విజయం సాధించారు. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ మద్దతుదారుల మధ్య జరిగిన ముక్కోణపు పోటీలో చివరికి కాంగ్రెస్ మద్దతుదారు విజయం సాధించాడు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
Comments are closed.