Homeఆంధ్రప్రదేశ్‌AP News: సీఎం కాన్వాయ్ కైతే కారు ఇవ్వాల్సిందేనా?

AP News: సీఎం కాన్వాయ్ కైతే కారు ఇవ్వాల్సిందేనా?

AP News: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు అధికారంలో ఉంటే ఆ దర్జాయే వేరు. ఏది కావాలన్నా క్షణాల్లో ప్రత్యక్షం. కొండ మీద కోతినైనా తేవచ్చు. అవసరమైతే రోడ్డు మీద వెళ్లే వారిని సైతం ఆపి వారి వాహనం లాక్కోవచ్చు. ఏమైనా అంటే సీఎం ఆదేశాలు మీరు ఏదైనా దారి చూసుకోండి అని ఉన్న పళంగా వాహనాన్ని లాక్కెళ్లిపోతారు. ఇక వారికి దిక్కెవరు? కంచే చేను మేస్తే చేసేదేమిటి? అని లోలోపలే కుమిలిపోవడం తప్ప వారు చేసేది లేదని తెలుస్తోంది. ఇదంతా ఎక్కడో మారుమూల గ్రామాల్లో కాదు జరిగింది. సాక్షాత్తు ఒంగోలు పట్టణంలోనే ఈ వింత చోటుచేసుకుంది.

AP News
AP News

పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన ఓ కుటుంబం కారు కిరాయికి తీసుకుని శ్రీవారి దర్శనానికి తిరుమల బయలుదేరారు. వారు ఒంగోలు చేరుకోగానే ఆకలేస్తుందని ఓ హోటల్ దగ్గర ఆగి టిఫిన్ చేస్తున్నారు ఇంతలో ఓ కానిస్టేబుల్ వచ్చి కారు ఎవరిదని ప్రశ్నించారు. దీంతో తమదేనని చెప్పారు. అయితే మీరు వేరే వాహనం చూసుకోండి సీఎం కాన్వాయ్ కు కారు అవసరం ఉంది. అందుకే డ్రైవర్ తో సహా తీసుకుపోయాడు. దీంతో ఆ కుటుంబం బిక్కుబిక్కుంటూ రోడ్డు మీదే నిలబడిపోయింది.

Also Read: Kamareddy Suicide Case: తెలంగాణలో అసహాయుల మరణాలు.. స్పందించని కేసీఆర్ సర్కార్

సీఎం కాన్వాయ్ కి ప్రైవేటు వాహనాలే కావాలా? తమ సొంత వాహనాలు ఉండవా అనే ప్రశ్నలు వస్తున్నాయి. పైగా వారు దేవుని దర్శనానికి వెళ్తుండగా వారి వాహనాన్ని తీసుకుపోవడం ఎంతవరకు సమంజసం అనే వాదనలు కూడా వస్తున్నాయి. అధికారంలో ఉంటే ఎవరికి గొప్ప ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. ఇలా దౌర్జన్యంగా లాక్కెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చేస్తున్నామని చెబుతున్నారు.

AP News
cm jagan

దీనిపై ఆ ఏరియా సీఐ మాట్లాడుతూ తమకు ఈ విషయం తెలియదని దాటేస్తున్నారు. వారి వాహనం తీసుకెళ్లినట్లు తెలిస్తే తమ వాహనం సమకూర్చే వారమని చెబుతున్నారు. పుణ్య క్షేత్రానికి వెళ్తున్న వారిపై జులుం చేయడం వివాదాలకు తావిస్తోంది. సీఎం జగన్ పాలన ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఉందని ఇప్పటికే అనేకమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సీఎం వ్యవహార శైలి ప్రజలకు ప్రాణసంకటంగా మారుతోందని చెబుతున్నారు.

Also Read:Prashant Kishor: పీకే చేరికతో కాంగ్రెస్ గెలుస్తుందా? బీజేపీని ఓడించడం సాధ్యమేనా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

4 COMMENTS

  1. […] AP high Court: ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల ర‌చ్చ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఈ విష‌యంలో హైకోర్టు ప‌లు ప్ర‌శ్న‌లు సంధించింది. టికెట్ ధరల అంశంపై హైకోర్టులో విచారణ నేప‌థ్యంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌న్హ‌రం. ప్ర‌భుత్వ నిర్ణ‌యాలు క‌రెక్ట్ కావ‌ని చుర‌క‌లంటించింది. సినిమా టికెట్ల ధరలను నిర్ణయించే అధికారం లేదంటూ తేల్చి చెప్పింది. ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది లైసెన్సింగ్‌ అథారిటీ మాత్రమేనని ధర్మాసనం క్లారిటీ ఇచ్చింది. టికెట్ల ధ‌ర‌ల‌పై ప్ర‌భుత్వానికి కేవ‌లం సూచ‌న‌లు చేసే అధికారం మాత్ర‌మే ఉందని గుర్తుచేసింది. […]

  2. […] KTR Language Style:  తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు.. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కావాలనుకుంటున్న రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖామాత్యులు కల్వకుంట్ల తారకరామారావు కూడా తండ్రి బాటలోనే పయనిస్తున్నారు. దుర్భాషలాడడంలో.. బూతు పదాలు వాడడంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వారసుడినే అని నిరూపించుకుంటున్నారు. తాజాగా వరంగల్‌ పర్యటన సందర్భంగా ఆయన వాడిన భాష, పద ప్రయోగం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. అమెరికా నుంచి వచ్చాడు.. ఉన్నత విద్యావంతుడు.. సబ్జెక్టు తెలిసి మాట్లాడుతాడు అనుకున్న రాష్ట్ర ప్రజలంతా ముక్కున వేలేసుకునేలా వరంగల్‌లో తన ప్రసంగం కొనసాగించారు. భాషకు కేసీఆరే అందరికీ గురువు అని ఇన్నాళ్లు అనుకున్నామని..కానీ కేటీఆర్‌ కూడా తగ్గేదేలే అన్నట్లు మాటలు వదిలారని బీజేపీ నేతలు సెటైర్లు వేశారు. అయితే ఇంత ఫ్రస్టేషన్‌ కేటీఆర్‌లో ఏమిటన్న ప్రశ్న తలెత్తుతోంది. […]

  3. […] MLA Rajaiah Brother:  రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ జిల్లా ఆ జిల్లా అనే తేడా లేకుండా టీఆర్ఎస్ నాయకులు రెచ్చిపోతున్నారు. తమకు నచ్చని వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. వారు మహిళలయితే లైంగికంగా వేధిస్తూ చుక్కలు చూపిస్తున్నారు. తమకు అధికారం అండగా ఉంది కదా అని రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. తమకు ఎదురు చెప్పిన వారిని లేకుండా చేసేందుకు ప్లాన్ చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. వారికి పోలీసులు కూడా సహకరిస్తున్నారని ప్రతి పక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రతి పక్ష పార్టీల ఆరోపణలు ఎలా ఉన్నా కానీ వారి చేష్టలు శృతి మించుతున్నాయని ఇప్పటికే చాలా మంది బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. […]

Comments are closed.

RELATED ARTICLES

Most Popular