రేపే పుర పోలింగ్.. 4 మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవం..

ఏపీలో ఇప్పటికే నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు ముగియగా.. మరో సమరానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక పోలింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. పార్టీలన్నీ పోలింగ్‌పైనే దృష్టి పెట్టాయి. ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై అన్ని పార్టీల్లోనూ టెన్షన్‌ నెలకొంది. దీంతో ప్రధాన పార్టీల కార్యకర్తలంతా పోల్ మేనేజ్‌మెంట్‌పై కసరత్తు చేస్తున్నారు. రేపే పోలింగ్‌ జరుగనుండడంతో.. ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తరలించడంపై ఫోకస్‌ చేస్తున్నారు. Also Read: అంటించిన కేంద్రం: […]

Written By: Srinivas, Updated On : March 9, 2021 10:11 am
Follow us on


ఏపీలో ఇప్పటికే నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు ముగియగా.. మరో సమరానికి సమయం ఆసన్నమైంది. ఇప్పటికే మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక పోలింగ్‌ మాత్రమే మిగిలి ఉంది. పార్టీలన్నీ పోలింగ్‌పైనే దృష్టి పెట్టాయి. ఓటరు తీర్పు ఎలా ఉంటుందన్న దానిపై అన్ని పార్టీల్లోనూ టెన్షన్‌ నెలకొంది. దీంతో ప్రధాన పార్టీల కార్యకర్తలంతా పోల్ మేనేజ్‌మెంట్‌పై కసరత్తు చేస్తున్నారు. రేపే పోలింగ్‌ జరుగనుండడంతో.. ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు తరలించడంపై ఫోకస్‌ చేస్తున్నారు.

Also Read: అంటించిన కేంద్రం: రగిలిన విశాఖ ‘ఉక్కు’ ఉద్యమం..

వార్డుల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికల రేంజ్‌లో సాగింది. అధికార, ప్రతిక్షాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఆరోపణలు, విమర్శల పర్వం హద్దులు దాటింది. ఆఖరి రోజు సైతం అన్ని పార్టీలు స్పీడుగా ప్రచారాన్ని ముగించాయి. ప్రచారం ముగిసినా.. ప్రలోభాల పర్వం జోరుగా సాగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. పోలింగ్‌కు ఒకరోజే మిగిలి ఉండడంతో అభ్యర్థులంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. వారిని ప్రలోబాలకు గురిచేసే అవకాశముంది.

ఇప్పటికే భారీగా షాపుల నుంచి మద్యం స్టాక్ తెచ్చి పెట్టుకున్న అభ్యర్థులు.. మందుబాబులను ప్రసన్నం చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. నగదు, ఇతరత్రా పంచే అవకాశం ఉండడంతో పోలీసులు నిఘా పెట్టారు. పోలింగ్‌కు సంబంధించి ఎప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. డబ్బు, మద్యం పంపిణీపై ఫిర్యాదులు రావడంతో ఎస్ఈసీ గట్టి నిఘా ఏర్పాటు చేసింది.

ఏపీలోని 75 మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు రేపు పోలింగ్‌ జరగనుంది. 14న కౌటింగ్ నిర్వహిస్తున్నారు. మొత్తం 12 కార్పొరేషన్లలో 671 డివిజన్లు ఉంటే.. ఇప్పటికే 89 ఏకగ్రీవం అయ్యాయి. 582 డివిజన్లలో ఎన్నికలు జరుగుతున్నాయి. 75 మున్సిపాలిటీల్లో 2123 వార్డులు ఉంటే.. 490 ఏకగ్రీవం అయ్యాయి. 1633 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం నుంచి పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకోనున్నారు. 78,71,272 మంది ఓటర్లు కాగా.. ఇప్పటికే 90 నుంచి 95 శాతానికి పైగా ఓటరు స్లిప్పులు పంపిణీ చేశారు. మొత్తం ఓటర్లలో పురుషులు 38,72,264 కాగా.. 39,97,840 మంది మహిళలు, 1168 మంది ఇతరులు ఉన్నారు. కాగా.. పురుషుల కంటే మహిళలే 1.6 శాతం ఎక్కువగా ఉండడం విశేషం.

Also Read: సీఎం కేసీఆర్ కొత్త పీఆర్వోగా ఈ సీనియర్ జర్నలిస్ట్?

మొత్తం 7,95 పోలింగ్‌ కేంద్రాల్లో సగానికిపైగా సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నందున భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 2320 అత్యంత సమస్యాత్మక, 2468 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా ప్రకటించారు. వీటిలో విజయవాడలో అత్యధికంగా 221, విశాఖపట్నంలో 185, గుంటూరులో 139, కడపలో 137, తిరుపతిలో 130, కర్నూలులో 123 అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. పోలింగ్‌ కోసం 48,723 మంది ప్రభుత్వ ఉద్యోగుల సేవలను వినియోగించుకోనున్నారు. కార్పొరేషన్లలో 21,888, పురపాలక, నగర పంచాయతీల్లో 26,835 మందిని కేటాయించారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్