ఏపీ ముద్రగడ కాపు ఉద్యమం… జగన్ కు కొత్త తలనొప్పి మొదలైనట్టే..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు కొత్త తలనొప్పులు మొదలవుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాల విమర్శలు, కోర్టుల్లో మొట్టికాయలు, అధికార పార్టీ నేతలపై వివాదాస్పద ఆరోపణల నేపథ్యంలో జగన్ సర్కార్ పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కరోనా, లాక్ డౌన్ వల్ల ఆదాయం తగ్గడంతో పాటు పలు పథకాల అమలు భారంగా మారింది. అధికార పార్టీ నేతల్లో చాలా మందికి కరోనా నిర్ధారణ అయింది. Also Read : తొలి టీకాకు బ్రాండ్ అంబాసిడర్ భారతీయ మహారాణులే..! […]

Written By: Navya, Updated On : September 22, 2020 2:19 pm
Follow us on


ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ కు కొత్త తలనొప్పులు మొదలవుతున్నాయి. ఇప్పటికే ప్రతిపక్షాల విమర్శలు, కోర్టుల్లో మొట్టికాయలు, అధికార పార్టీ నేతలపై వివాదాస్పద ఆరోపణల నేపథ్యంలో జగన్ సర్కార్ పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కరోనా, లాక్ డౌన్ వల్ల ఆదాయం తగ్గడంతో పాటు పలు పథకాల అమలు భారంగా మారింది. అధికార పార్టీ నేతల్లో చాలా మందికి కరోనా నిర్ధారణ అయింది.

Also Read : తొలి టీకాకు బ్రాండ్ అంబాసిడర్ భారతీయ మహారాణులే..!

ఇలాంటి సమయంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం జగన్ ను కొత్త టెన్షన్ పెడుతున్నారు. మరోసారి ముద్రగడ నేతృత్వంలో కాపు ఉద్యమం దిశగా అడుగులు పడుతున్నాయి. కొన్ని రోజుల క్రితం కాపు ఉద్యమం నుంచి తప్పుకుంటున్నట్టు కీలక ప్రకటన చేసిన ముద్రగడ పద్మనాభం తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న పశ్చిమగోదావరి జిల్లాలో 13 జిల్లాల కాపు జేఏసీ నేతలు సమావేశమయ్యారు.

రాష్ట్రంలోని పరిస్థితుల గురించి, కాపు ఉద్యమం గురించి, ఇతర విషయాల గురించి ప్రధానంగా చర్చించారు. నిన్న సమావేశంలో చర్చించిన అంశాల గురించి ముద్రగదతో భేటీ అయ్యి మాట్లాడనున్నారు. కాపు నేతలు ముద్రగడను కలిసి కాపు ఉద్యమానికి నేతృత్వం వహించమని కోరనున్నారు. ముద్రగడే తమ నాయకుడని… ఆయన నాయకత్వంలోనే కాపు ఉద్యమం దిశగా అడుగులు పడతాయని పేర్కొన్నారు.

ముద్రగడ నాయకత్వంలో మాతమే తాము రిజర్వేషన్లు పొందే అవకాశం ఉందని జేఏసీ నేతలు పేర్కొన్నారు. జేఏసీకి కాపుల సంక్షేమం, అభివృద్ధి మాత్రమే ముఖ్యమని అందుకోసం ఎవరు పాటు పడినా సహాయసహకారాలు ఉంటాయని చెప్పారు. జేఏసీ నేతలతో భేటీ తరువాత ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాల్సి ఉంది.

Also Read : వ్యవసాయ బిల్లులు కార్పొరేట్లకు దోచిపెట్టడమా?