AP Ministers on Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోనార్కని తెలిసిందే. ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి తిరుగుండదు. ఒకసారి ఫిక్సయితే తన మాట తానే వినడనే వాదన కూడా ఉంది. కానీ మంత్రివర్గ విస్తరణ సందర్భంలో జగన్ తీసుకున్ని నిర్ణయంతో చాలా మంది అసంతృప్తికి గురయినట్లు తెలుస్తోంది. రకరకాలుగా పైరవీలు చేస్తూ తమకు మళ్లీ అవకాశం ఇవ్వాలని చెబుతున్నట్లు సమాచారం. అనవసరంగా మంత్రివర్గ విస్తరణ తుట్టెను కదిపినట్లు జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

జగన్ కోరిన వెంటనే రాజీనామాలు చేసిన మంత్రులు ఇక ఎలా తిరిగేదని అలక బూనినట్లు వారి ముఖాలను బట్టి అర్థమవుతోంది. ఇన్నాళ్లు ప్రతిపక్షాలను తిట్టిపోసిన తాము ఇకపై ఎలా మాట్లాడేదని నిరాశ చెందుతున్నారు. ఇక తమను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఎవరికి తోచిన విధంగా వారు పైరవీలు మొదలు పెట్టారు. మంత్రి బొత్స సత్యనారాయణ నేతృత్వంలో కొంతమంది సమావేశమై జగన్ పై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
Also Read: తెగ బిల్డప్ ఇచ్చారు.. రెండు రోజులకే తెగ బాధపడుతున్నారు
ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని ముందుకెళ్లినా ఇప్పుడు ఎలా తిరిగేదని చెబుతున్నారు. హైదరాబాద్ లో సమావేశమై జగన్ కు అల్టిమేటం జారీ చేస్తున్నారు. మంత్రివర్గంలో తమ పేరు ఉండాలని సూచిస్తూ గాలి జనార్ధన్ రెడ్డి వంటి నేతలతో చెప్పిస్తున్నారు. దీంతో మంత్రివర్గ విస్తరణ జగన్ కు తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పవన్ లపై బూతులతో విరుచుకుపడిన నేతలు ఇప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.
ఇప్పటికే మంత్రివర్గంపై ఓ అంచనాకు వచ్చిన జగన్ కు ఇప్పుడు కొత్త చిక్కులు వస్తున్నాయి. మొదట ఐదారుగురిని తీసుకోవాలని భావించినా తరువాత వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. మంత్రివర్గంలోకి ఎవరెవరిని తీసుకోవాలని ఓ స్కెచ్ వేసుకున్న జగన్ ఇప్పుడు మంత్రుల పైరవీలతో కుదేలైపోతున్నారు. వారిని ఎలా దారికి తెచ్చుకోవాలో అర్థం కావడం లేదు. మొత్తానికి జగన్ మెడకు మంత్రివర్గం ఉచ్చు చిక్కుకున్నట్లు సమాచారం.
Also Read: వెంట్రుక కూడా పీకలేరు.. జగన్ ధైర్యం వెనుక కారణమేంటి?
[…] […]
[…] […]
[…] Telangana Politics: యువత తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయ్ అనే సినిమా డైలాగ్ మీకు గుర్తుంది కదా.. ఇది డైలాగ్ మాత్రమే కాదండోయ్ నిజంగా జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక సమాజ గతిని మార్చాలంటే కండలు తిరిగిన బుద్ధిమంతులైన యువతతోనే సాధ్యం. అది రాజకీయాలు అయినా మరింకేదైనా సరే. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. ఏ పార్టీ వైపు యువత ఉంటే ఆ పార్టీ గెలుపు సాధ్యమవుతుందని గతంలో జరిగిన చాలా ఎన్నికలు నిరూపించాయి. […]