Homeఆంధ్రప్రదేశ్‌Minister Roja: ఎరక్క వచ్చి ఇరుక్కుపోయి.. అభివృద్ధి పంచాయితీ వేళ కేసీఆర్‌ను కలిసిన ఏపీ మంత్రి...

Minister Roja: ఎరక్క వచ్చి ఇరుక్కుపోయి.. అభివృద్ధి పంచాయితీ వేళ కేసీఆర్‌ను కలిసిన ఏపీ మంత్రి రోజా!

Minister Roja: పాపం రోజా.. మంత్రి పదవి వచ్చిన కొత్తల్లో కేసీఆర్‌ అపాయింట్‌ మెంట్‌ అడిగారు. అది ఈరోజు ఫిక్స్‌ అయింది. కానీ ఆమె బ్యాడ్‌ లక్‌ ఏంటంటే.. కేసీఆర్‌ని వెళ్లి కలిసే రోజు.. సరిగ్గా కలిసేలోపే రెండు తెలుగు రాష్ట్రాల్లో కేటీఆర్‌ మాటల మంటలు రేపారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల మంత్రులు, నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇది తెలలియని రోజా.. కేసీఆర్‌ను కలిసిన తర్వాత బాగానే ఇబ్బంది పడ్డారు. ప్రగతి భవన్‌ బయటకొచ్చాక కేటీఆర్‌ని ఏమీ అనలేక, అలాగని ఏపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు కౌంటర్‌ ఇవ్వలేక రోజా డైలమాలో పడ్డారు. కేటీఆర్‌ పొరుగు రాష్ట్రాలన్నారు కానీ ఏపీ అనలేదని, ఆయన్ను ఆ స్నేహితుడెవరో తప్పుదోవ పట్టించి ఉంటారని కవర్‌ చేశారు.

Minister Roja
Minister Roja

అభివృద్ధి పంచాయితీ..

కేటీఆర్‌ వ్యాఖ్యలకు వైసీపీ గట్టిగానే కౌంటర్లు ఇస్తోంది. మంత్రులు, ఇతర నేతలు ఇలా ఎవరికి వారు కేటీఆర్‌ని ఓ ఆటాడేసుకుంటున్నారు. ఆదిమూలపు సురేశశ్‌లాంటి వాళ్లయితే టీవీ చర్చల్లో, లైవ్‌లోనే చెడుగుడు ఆడుకున్నారు. ఇక నెటిజన్లు ఊరుకుంటారా..? టీఆర్‌ఎస్‌ డబుల్‌ బెడ్‌ రూమ్‌ హామీతో వెటకారాలాడుతున్నారు. ఏపీలో జగనన్న హౌస్‌ సైట్స్‌ అందరికీ ఇచ్చారని, తెలంగాణలో డబుల్‌ బెడ్‌ రూమ్‌ హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ అవకాశాన్ని చేజేతులారా మిస్‌ చేసుకున్నది మాత్రం ఒక్క రోజానే. మామూలుగా రోజాకి ఇలాంటి అవకాశాలు దొరికితే.. కేటీఆర్‌నే కాదు, కేసీఆర్‌ని కూడా కలిపి విమర్శించేవారు. గతంలో కూడా గులాబీ బాస్‌ని ఇలాగే ఓ ఆట ఆడేసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు సహకరించలేదు.

Also Read: Star Heroine: మత్తులో సర్వం కోల్పోతున్న స్టార్ హీరోయిన్ ?

గురువు ఇంటికి శిష్యురాలిగా..

రోజా సినిమాల్లో నటిస్తూనే రాజకీయరంగంలోకి అడుగు పెట్టారు. 1999లో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ సమయంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా టీడీపీలోనే ఉన్నారు. ఆ సమయంలో సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి కొత్తగా అడుగు పెటట్టిన రోజా రాజకీయ ఎదుగుదలకు కేసీఆర్‌ సలహాలు సూచనలు ఇచ్చారని సమాచారం. ఆ కృతజ్ఞతను రోజా ఎప్పుడూ ప్రదర్శిస్తారు. 2019లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రావడం.. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ విజయం వెనుక కేసీఆర్‌ సహకారం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక హైదరాబాద్‌కు వచ్చి కేసీఆర్‌ను కలిశారు. తర్వాత కేసీఆర్‌ కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్లారు. సమయంలో నగరిలోని తమ ఇంటికి రావాలని రోజా ఆహ్వానించారు.

Minister Roja
Minister Roja

ఈమేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా కుటుంబ సమేతంగా రోజా ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించారు. తాజాగా రోజాకు ఏపీ క్యాబినెట్‌లో చోటు దక్కింది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతులు చేపట్టారు. ఈ నేపథ్యంలో తన రాజకీయ గురువు అయిన కేసీఆర్‌ను కలవాలని వారం క్రితం అపాయింట్‌మెంట్‌ కోరారు. అది కాకతాళీయంగా శుక్రవారమే లభించింది. ఇదే రోజు క్రెడాయ్‌ సదస్సులో ఏపీ అభివృద్ధిపై కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం తెలియని రోజా కుటుంబ సమేతంగా ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిశారు. కేసీఆర్‌ కుటుంబం కూడా బొట్టు పెట్టి ఆమెకు ఆహ్వానం పలికింది. సారె పెట్టి సాగనంపింది. ప్రగతి భవన్‌ నుంచి బయటకు వచ్చాక కేటీఆర్‌ వ్యాఖ్యల గురించి తెలుసుకున్న మంత్రి రోజా ఇలాంటి సందర్భంలో కేటీఆర్‌పై విమర్శలు చేయడం మర్యాదగా ఉండదని.. మొహమాటానికి ఏదో మమ అనిపించేశారు.

అదే సమయంలో కేటీఆర్‌కి కౌంటర్‌ ఇవ్వకపోయినా ఇబ్బందే. అందుకే ఆమె కేటీఆర్‌కి ఓ సవాల్‌ విసిరారు. ఆయన ఎప్పుడు అపాయింట్‌మెంట్‌ ఇస్తే అప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా తానే స్వయంగా ఏపీ మొత్తం తిప్పి చూపిస్తానన్నారు. ఆయనతో పాటు, ఆ స్నేహితుడెవరో కూడా వస్తే వారికి కూడా ఏపీలోని అభివృద్ధి చూపిస్తానని, ఇక్కడి పాలన చూసి తెలంగాణలో కూడా ఇలాంటి పథకాలు తీసుకొచ్చే అవకాశముందని చెప్పారు రోజా.

ఇక్కడ ఆమె రాజకీయ చతురత ప్రదర్శించారు. కేటీఆర్‌ని పల్లెత్తు మాట అనకుండానే ఆ తప్పు మొత్తం ఆ ఊరూ పేరు లేని స్నేహితుడిపై వేశారు. ఒక విధంగా మంత్రి హోదాలో తెలంగాణలో రోజాది శుక్రవారం రాంగ్‌ ఎంట్రీ అనే చెప్పాలి.

Also Read: KTR Comments On AP: ఆంధ్రాపై వ్యాఖ్యలు.. దిగివచ్చిన కేటీఆర్.. జగన్ సోదరుడట..

Recommended Videos

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular