Ap minister Nageshwara Rao : చిరు కోపం ఎంతో అందంగా ఉంటుంది. ఒక్కో సందర్భాన్ని బట్టి ప్రేమగా తిట్టిన ప్రతి తిట్టూ ఎంతో ఆనందంగా ఉంటుంది. అందులో ఆప్యాయత, అభిమానం, ఆపేక్ష దాగి వుంటుంది. ఇదంతా గతం. ఇప్పుడు వైసీపీ నేతల తిట్లు ఇందుకు భిన్నం. పాలకుల్లో జవాబుదారీతనం లోపించినప్పుడు, ఎవరు ఏది మాట్లాడిన అహం అడ్డొస్తుంది. నన్నే ప్రశ్నిస్తావా అంటూ పట్టలేనంత కోపం వారిలో కనబడుతుంది. ప్రతిపక్షాలనే కాకుండా సామాన్యులు, రైతులు కూడా ‘తిట్ల’కు బాధితులుగా మారిపోతున్నారు.
తాజాగా ఏపీ మంత్రి పట్టలేని కోపానికి ఓ రైతు బాలయ్యాడు. అతను చేసిన పాపం ఆయనను ప్రశ్నించడమే. ప్రస్తుతం అకాల వర్షాలు పొలాలను మంచెత్తుతున్నాయి. పంట నష్టపోయి రైతులు తీవ్ర ఆవేదన మునిగిపోయి ఉన్నారు. నష్ట పరిహారంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి హామీ లభించడం లేదు. అధికారులు కూడా లెక్కలు తీసుకోవడంతో జాప్యం చేస్తున్నారు. చేతికొచ్చిన పంట నీటి పాలవ్వడంతో నష్ట పరిహారం ఇప్పంచాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దృష్టికి ఓ రైతు తీసుకెళ్లాడు. ఆయన తణుకు మండలం, వేల్పూరు గ్రామంలో పర్యటనకు వెళ్లారు. సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎందుకొచ్చిన గోలలే అనుకొని అందరూ ఏమీ లేవని అంటుండగా, ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇంతలో అక్కడే ఓ రైతు అకాల వర్షాలకు పంట తడిసి మొలకలు వచ్చాయని రైతుల నుండి పంట కొని ఆదుకోవాలని కోరాడు. అంతమంది మధ్యలో ఆ రైతు అలా అనేసరికి మంత్రి కారుమూరికి పట్టరాని కోపం వచ్చేసింది. ‘‘వెర్రిపప్పా.. వరదలొస్తే నేనేం చేసది’’ అంటూ ఆగ్రహంతో ఊగిపోతూ తిట్ల దండకాన్ని ఎత్తుకున్నారు.
ఆరుగాలం శ్రమించి పంటను కాపాడుకునేందుకు నానా కష్టాలు పడుతున్న రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని పలువురు మండిపడుతున్నారు. రైతులను ఆదుకునేందుకు తమ ప్రభుత్వం ముందుందని చెప్పే బదులు వరదలొస్తే నేనేం చేసేది అని అనడం ఒక మంత్రిగా ఆయన బాధ్యాతారహిత్యం పరాకాష్ట అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. కనీస అవగాహన లేని వారిని మంత్రి స్థానంలో కూర్చొబొడితే రిజల్ట్ ఇలానే ఉంటుందని అనడానికి ఇదొక ఉదాహరణ.