హరీష్ రావుకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఏపీ మంత్రి

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఏపీ, తెలంగాణ మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలు సన్నిహితంగా మెలుగుతూ రాజీమార్గంలో వెళుతున్నారు. మొదటి నుంచి వీరిద్దరి ఉమ్మడి శత్రువు చంద్రబాబే కావడంతో వీరిమధ్య సఖ్యత కూడా బాగా కలిసింది. ఏపీలో ఎన్నికలకు ముందు జగన్ సీఎం అవుతాడని కేసీఆర్ జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే జగన్ సీఎం అయ్యారు. నాటి నుంచి వీరిద్దరు కలిసి నడుస్తూ రెండు రాష్ట్రాల అభివృద్ధికి […]

Written By: NARESH, Updated On : September 25, 2020 5:20 pm

harishrao balineni

Follow us on


వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక ఏపీ, తెలంగాణ మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయి. తెలంగాణ సీఎం కేసీఆర్.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిలు సన్నిహితంగా మెలుగుతూ రాజీమార్గంలో వెళుతున్నారు. మొదటి నుంచి వీరిద్దరి ఉమ్మడి శత్రువు చంద్రబాబే కావడంతో వీరిమధ్య సఖ్యత కూడా బాగా కలిసింది. ఏపీలో ఎన్నికలకు ముందు జగన్ సీఎం అవుతాడని కేసీఆర్ జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే జగన్ సీఎం అయ్యారు. నాటి నుంచి వీరిద్దరు కలిసి నడుస్తూ రెండు రాష్ట్రాల అభివృద్ధికి పాటుపడుతున్నారు.

Also Read: పదో తరగతి‌ విద్యార్థులకు అన్యాయమేనా?

అయితే కొద్దిరోజుల టీఆర్ఎస్-వైసీపీ మధ్య బేదాభిప్రాయాలు చోటుచేసుకుంటున్నాయి. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ఇటీవల ఇరురాష్ట్రాల మధ్య వివాదం నెలకొంది. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి సీఎంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ దూసుకెళుతూ కేసీఆర్ ను ఇరుకునపెడుతున్నారు. కరోనా విషయంలోనూ జగన్ కు మంచి క్రెడిట్ రాగా.. తెలంగాణలో కేసీఆర్ గ్రాఫ్ క్రమంగా పడిపోయింది. ఈక్రమంలోనే వైసీపీ-టీఆర్ఎస్ మధ్య గతంలో నెలకొన్న సంబంధాలు క్రమంగా మసకబారుతూ వస్తున్నాయి.

ఈక్రమంలోనే తెలంగాణ మంత్రి హరీష్ రావు ఏపీ ప్రభుత్వంపై తాజాగా విమర్శలు చేశారు. కేంద్రం రైతులకు ఉచిత విద్యుత్ మీటర్లు అమలు చేయాలని కోరగా తెలంగాణ బేషరతుగా నో చెప్పింది. ఏపీ ప్రభుత్వం మాత్రం రైతులకు ఉచిత విద్యుత్ మీటర్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ కేవలం 4వేల కోట్ల కోసం రైతుల మెడకు ఉరితాడు బిగించేందుకు సిద్ధమవుతుందంటూ హరీష్ రావు ఘాటుగా స్పందించారు.

Also Read: పరువు హత్య: కూతురు పెళ్లి చేసుకుందని తండ్రి దారుణం

దీనిపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని స్పందిస్తూ.. కేంద్రం ఇచ్చే 4వేల కోట్లు రైతుల అభివృద్ధికే ఉపయోగిస్తామని.. అంతేతప్ప జేబుల్లో వేసుకోమంటూ వ్యాఖ్యనించారు. రైతులకు ఉచిత విద్యుత్ విషయంలో జగన్ సర్కార్ కట్టుబడి ఉందని.. మరో 30ఏళ్లపాటు ఏపీలో రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. కేంద్రంతో సఖ్యత విషయంలో టీఆర్ఎస్ పార్టీలో ప్లేట్ మార్చబోమన్నారు. కొద్దిరోజులు కేంద్రంతో మంచిగా ఉండటం.. మరికొన్నిరోజులు గొడవలు పడమన్నారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే రాష్ట్రాభివృద్ధికి ముందుకెళుతామని ఏపీలోని విపక్షాలతోపాటు హరీష్ రావుకు మంత్రి బాలినేని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.