https://oktelugu.com/

AP Minister Audio tape: మహిళతో ఏపీ మంత్రి ఆడియో టేప్ వైరల్

ఏపీ మంత్రి చిక్కుల్లో పడ్డారు. ఆయన పేరిట సోషల్ మీడియాలో ఒక ఆడియో టేప్ వైరల్ అవుతోంది. ఓ మహిళతో ఏపీ మంత్రి సంభాషిస్తున్నట్టుగా ఉన్న ఓ ఆడియో టేప్ సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న మంత్రి ఈ ఆడియో టేప్ నకిలీదంటూ మీడియా ఎదుట క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి కుట్రదారులు ఎవరో తేల్చాలని కోరారు. ఏపీ మంత్రి ఓ మహిళతో మాట్లాడుతున్న ఆడియో […]

Written By: , Updated On : August 20, 2021 / 09:28 AM IST
Follow us on

ఏపీ మంత్రి చిక్కుల్లో పడ్డారు. ఆయన పేరిట సోషల్ మీడియాలో ఒక ఆడియో టేప్ వైరల్ అవుతోంది. ఓ మహిళతో ఏపీ మంత్రి సంభాషిస్తున్నట్టుగా ఉన్న ఓ ఆడియో టేప్ సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది. రాజకీయవర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకున్న మంత్రి ఈ ఆడియో టేప్ నకిలీదంటూ మీడియా ఎదుట క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు చేసి కుట్రదారులు ఎవరో తేల్చాలని కోరారు.

ఏపీ మంత్రి ఓ మహిళతో మాట్లాడుతున్న ఆడియో టేప్ లో ఏంముందుంటే… ‘పిచ్చి వేశాలు వేయకుండా ఇంటికిరా.. నా మాట విను.. అన్ని రకాలుగా బాగుంటుంది.. అరగంటలో పంపించేస్తాను. చెప్పిన మాట విను. నా కోసం అరగంట సమయం కూడా కేటాయించలేవా? ఏం చేస్తున్నావ్? రాకపోతే నీ ఇష్టం.. వస్తే మంచి భవిష్యత్ ఉంటుంది’ అంటూ ఓ మహిళతో ఏపీ మంత్రి మాట్లాడిన ఆడియో తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరి ఆడియో వింటే అది సరసాల కోసమా? లేక వేరే ఏదైనా పని యా అన్నది తెలియదు కానీ.. తెగ వైరల్ అవుతోంది.

ఇక ఈ ఆడియో దుమారం రేపడంతో ఏపీ మంత్రి నిన్న పోలీసులకు ఫిర్యాదు చేసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తన రాజకీయ ఎదుగుదల చూసి ఓర్వలేకనే కొందరు నకిలీ ఆడియో సృష్టించి సామాజికమాధ్యమాల్లో వైరల్ చేశారని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యే, ఎంపీగా, ప్రస్తుతం జిల్లా మంత్రిగా ఉన్న తనపై ఎవరో కుట్ర చేశారని.. బురద చల్లడానికి ఈ పనిచేశారని తెలుస్తోందన్నారు. ఎవరెవరో ఫోన్లు చేసి అడుగుతుంటే బాధనిపిస్తోందన్నారు.

ఇక ఈ ఆడియో ఎవరు సృష్టించారో తెలియదని.. శత్రువులు లేరని.. నిందితులు ఎవరన్నది ప్రస్తుతం ఊహించలేమని ఏపీ మంత్రి తెలిపారు.

*ఏపీ మంత్రి ఆడియోను కింద వినవచ్చు..

YouTube video player