
తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరు ఆంధ్రప్రదేశ్ కు సాగు, తాగునీటి కష్టాలు ఎదురవుతున్నాయి. ఎగువ రాష్ట్రమైన తెలంగాణ ఇప్పుడు శ్రీశైలం, నాగార్జునసాగర్ లలో నిల్వఉన్న నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరిట వృథాగా వదిలేస్తుండడంతో ఏపీ నుంచి అది సముద్రంలోకి వృథాగా చేరిపోతోంది. దీంతో లక్షల క్యూసెక్కుల నీరుగా గంగపాలవుతోంది.
ఏపీ అక్రమ ప్రాజెక్టులు కడుతోందంటూ తెలంగాణ ఆరోపిస్తోంది. రాయలసీమ ఎత్తిపోతల పేరిట కృష్ణా జలాలను దోచుకుంటోందని కేసీఆర్, మంత్రులు ఆరోపిస్తున్నారు. దీంతో ఏపీకి అసలు నీరు లేకుండా చేసే ప్లాన్లను తెలంగాణ చేస్తోంది. ప్రాజెక్టుల్లోని నీటితో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటోంది. తద్వారా వేల క్కుసెక్కుల నీరును వృథాగా సముద్రం పాలు చేస్తోంది. ఏపీకి సాగు, తాగునీటి కష్టాలు వచ్చేలా చేస్తోందని ఏపీ వాసులు ఆందోళన చెందుతున్నారు.
ఎగువన ఉన్న ప్రాజెక్టుల్లో తెలంగాణ జెన్ కో ఉత్పత్తి చేస్తూ కిందకు నీటిని విడుదల చేస్తోంది. దీంతో అది కాస్తా ప్రకాశం బ్యారేజీకి నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. మొత్తం 20 గేట్ల ద్వారా 8340 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదలుతున్నారు. బ్యారేజీలో ప్రస్తుతం 3.07 టీఎంసీల నీటి నిల్వలు ఉండడంతో అదనపు నీటిని నిల్వ చేయలేని పరిస్థితితో సముద్రంలోనికి ఏపీ అధికారులు విడిచిపెడుతున్న దుస్థితి నెలకొంది. ఎగువ నుంచి పులిచింత ప్రాజెక్టుకు 39700 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఈ ప్రాజెక్ట్ వద్ద తెలంగాణ జెన్ కో విద్యుత్ ఉత్పత్తి చేయడంతో 7200 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది.
ఇక పెద్ద ప్రాజెక్టులైన నాగార్జున సాగర్ రిజర్వాయర్ తోపాటు , శ్రీశైలం నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ తెలంగాణప్రభుత్వం వృథాగా కిందకు నీరు విడుదల చేస్తోందని.. వానలు పడకపోతే నీటి కరువు వస్తుందని ఏపీ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.