https://oktelugu.com/

చంద్రబాబు, అదానీ, ఓ జగన్.. కథ

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ఎప్పుడైతే తప్పించాలని ముఖ్యమంత్రి జగన్‌ తలిచారో.. అప్పటి నుంచే ఆయన మదిలో విశాఖ క్యాపిటల్‌ సిటీగా ఫిక్స్‌ అయ్యారు. మూడు రాజధానుల నిర్ణయంపై హైకోర్టులో పిల్స్‌ దాఖలైనా.. ఇంకా విచారణ నడుస్తున్నా జగన్‌ తన పనిని తాను చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ముఖ్యంగా విశాఖకు క్యాపిటల్‌ హంగులు అద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కొక్కటిగా అక్కడికి తరలిస్తున్నారు. Also Read: వాళ్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. తక్షణమే రూ.10 వేల సాయం..? నాటి చంద్రబాబు […]

Written By:
  • NARESH
  • , Updated On : November 14, 2020 1:32 pm
    Follow us on

    Jagan Adani

    ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని ఎప్పుడైతే తప్పించాలని ముఖ్యమంత్రి జగన్‌ తలిచారో.. అప్పటి నుంచే ఆయన మదిలో విశాఖ క్యాపిటల్‌ సిటీగా ఫిక్స్‌ అయ్యారు. మూడు రాజధానుల నిర్ణయంపై హైకోర్టులో పిల్స్‌ దాఖలైనా.. ఇంకా విచారణ నడుస్తున్నా జగన్‌ తన పనిని తాను చేసుకుంటూ పోతూనే ఉన్నారు. ముఖ్యంగా విశాఖకు క్యాపిటల్‌ హంగులు అద్దేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కొక్కటిగా అక్కడికి తరలిస్తున్నారు.

    Also Read: వాళ్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. తక్షణమే రూ.10 వేల సాయం..?

    నాటి చంద్రబాబు హయంలో విశాఖలో అదానీ గ్రూపు తెగ హడావుడి చేసింది. విశాఖను ఐటీ రాజధాని చేస్తామని బాబు, ఆయన కుమారుడు ఐటీ మంత్రి లోకేష్ చాలానే కబుర్లు చెప్పుకొచ్చారు. కానీ నాడు అది అమలు కాలేదు. ఇప్పుడు జగన్ మాత్రం అదే అదానీ గ్రూపుతో కొత్త ఒప్పందం చేసుకున్నారు. జగన్ ఒప్పందం చూస్తే చంద్రబాబు ఏలుబడిలో అదానీ గ్రూప్ పెద్దలు కావాలని చేశారా..? లేక ప్రభుత్వమే అక్కడితో ఆగిపోయిందా అనే అనుమానాలు కలుగక మానవు.

    అదాని గ్రూప్‌కు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పనంగా 500 ఎకరాల భూమి ఇచ్చాడు. వారి నుంచి కేవలం 6000 మందికే ఉద్యోగాలు ఆశించారు. ఇక జగన్ గత ఏడాదిన్నర కాలంలో ఆదానీ గ్రూప్‌తో జరిపిన చర్చల ఫలితంగా అద్భుతమైన ఫలితాలే వచ్చాయనుకోవాలి. కేవలం 130 ఎకరాల భూమి మాత్రమే వైసీపీ సర్కార్ వారికి ఇస్తూ.. వారి నుంచి 25 వేల మందికి ఉద్యోగాలను రాబడుతోంది. ఈ తేడాను గమనిస్తే వైసీపీ హయాంలో జరిగిన మేలు ఏంటో అర్థమవుతోందని పార్టీ నాయకులు అంటున్నారు.

    Also Read: ఏపీ విద్యార్థులకు అలర్ట్.. ఇంటర్ తరగతులు మళ్లీ వాయిదా..?

    విశాఖ ఐటీ రాజధాని కాకపోవడంతో ఆదానీ గ్రూపు అక్కడి నుంచి వెళ్లిపోయింది. తాజాగా.. రాష్ట్ర మంత్రివర్గం మాత్రం ఆదానీ గ్రూప్‌నకు విశాఖలో భూమిని కేటాయిస్తూ అనుమతులు మంజూరు చేసింది. దీన్ని చూసిన తమ్ముళ్లు ఎలా స్పందిస్తారో అని అనుమానాలు ఉన్నాయి. ఒకప్పుడు ఆదానీ గ్రూపునకు భూమి కేటాయింపుపై వైసీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది.

    విశాఖలో ఆరు లేన్ల జాతీయ రహదారులను నిర్మించాలని ఈ మధ్యనే జగన్ కేంద్ర మంత్రి గడ్కరీని కోరారు. విశాఖకు మెట్రో రైలు ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారు. విశాఖ నుంచి భోగాపురం దాకా దాన్ని పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఇక భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి తొందరలోనే జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ కూడా మొత్తం మూడు వేల ఎకరాల భూమిని సేకరిస్తే అందులో నుంచి అయిదు వందల ఎకరాలను వైసీపీ సర్కార్ వెనక్కి తీసుకుని మిగిలిన దాంట్లోనే పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఇది కచ్చితంగా 15 వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆర్థిక లాభం. ఆదానీ భూముల విషయంలో కూడా అంతే విలువ చేసే భూమి ప్రభుత్వం కాపాడిందని చెబుతున్నారు. మొత్తానికి జగన్‌ పూర్తిస్థాయిలో విశాఖ మీదనే దృష్టి పెట్టినట్లుగానే అర్థమవుతోంది. మరి జగన్‌ అటెన్షన్‌.. టీడీపీలో టెన్షన్‌ పుడుతున్నట్లే కనిపిస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్