మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో హైకోర్టు ఆగ్రహం..

మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం పన్నిన ఉచ్చులో అశోక్ గజపతి రాజును తాత్కాలికంగా పదవి నుంచి తొలగించినా తరువాత హైకోర్టు జోక్యం చేసుకోవడంతో మళ్లీ తన పదవి దక్కించుకున్నారు. మాన్సాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. ఉద్యోగులకు వేతనాలు నిలిపివేయడం, ట్రస్ట్ ఖాతాలు స్తంభింపచేయడం వంటి అంశాలపై అశోక్ గజపతి రాజు వేసిన పిటిషన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రస్ట్ […]

Written By: Srinivas, Updated On : July 27, 2021 6:08 pm
Follow us on

మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం పలు మలుపులు తిరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం పన్నిన ఉచ్చులో అశోక్ గజపతి రాజును తాత్కాలికంగా పదవి నుంచి తొలగించినా తరువాత హైకోర్టు జోక్యం చేసుకోవడంతో మళ్లీ తన పదవి దక్కించుకున్నారు. మాన్సాస్ ట్రస్ట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు షాకిచ్చింది. ఉద్యోగులకు వేతనాలు నిలిపివేయడం, ట్రస్ట్ ఖాతాలు స్తంభింపచేయడం వంటి అంశాలపై అశోక్ గజపతి రాజు వేసిన పిటిషన్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ట్రస్ట్ సిబ్బందికి తక్షణమే వేతనాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. ట్రస్ట్ ఖాతాలు సీజ్ చేయాలంటూ ఈవో ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. ట్రస్ట్ కింద ఉన్న సంస్థల వ్యవహారంలో జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. పాలకమండలి సమావేశం ఏర్పాటు చేయాలని ఈవో ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను కూడా హైకోర్టు రద్దు చేసింది.

ఈవో సర్వాధికారాలు చూపించడంపై ప్రశ్నించింది. వేతనాలు నిలిపివేయడంలో ఈవో పాత్ర ఏమిటని, ఈవో ఏం చేస్తారో చెప్పాలని సూచించింది. ఈవో ఆదేశాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఆడిటింగ్ పేరుతో గందరగోళం సృష్టించడం ఏమిటని అశోక్ తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎవరు పడితే వారు ఆడిటింగ్ చేయరాదని జిల్లా స్థాయి అధికారి మాత్రమే ఆడిట్ చేయాలని సూచించింది.

మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగానే ఉంటోంది. రాత్రి అశోక్ గజపతి రాజును అరెస్టు చేయడం తరువాత సంచైతకు పదవి ఇవ్వడంపై సందేహాలు వ్యక్తం చేశారు. ఆడిటింగ్ పేరుతో జీతాలు ఇవ్వడమే మానేశారు. దీంతో ఉద్యోగులు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగుల్ని రెచ్చగొట్టేలా ప్రభుత్వ వ్యవహారం ఉంటుందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.