https://oktelugu.com/

AP High Court: ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

AP High Court: సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు, ఆన్ లైన్ టికెటింగ్ విధానం, థియేటర్లలో పార్కింగ్ సదుపాయం, సినిమాళ్ల సీజ్ వంటి అంశాలు కొద్దిరోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఇష్యూపై ఎవరికీ వారు తమ వాదనలను బలంగా విన్పిస్తుండటంతో రోజుకో చర్చ తెరపైకి వస్తూ ప్రతీఒక్కరిలోనూ ఆసక్తిని పెంచుతోంది. జగన్ సర్కారు తీసుకొచ్చిన ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి సినీ ఇండస్ట్రీ సైతం మద్దతు తెలుపుతోంది. అయితే సినిమా టికెట్ల తగ్గింపును […]

Written By:
  • NARESH
  • , Updated On : January 20, 2022 / 12:01 PM IST
    Follow us on

    AP High Court: సినిమా టికెట్ల రేట్ల తగ్గింపు, ఆన్ లైన్ టికెటింగ్ విధానం, థియేటర్లలో పార్కింగ్ సదుపాయం, సినిమాళ్ల సీజ్ వంటి అంశాలు కొద్దిరోజులుగా ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి. ఈ ఇష్యూపై ఎవరికీ వారు తమ వాదనలను బలంగా విన్పిస్తుండటంతో రోజుకో చర్చ తెరపైకి వస్తూ ప్రతీఒక్కరిలోనూ ఆసక్తిని పెంచుతోంది.

    AP High Court:

    జగన్ సర్కారు తీసుకొచ్చిన ఆన్ లైన్ టికెటింగ్ విధానానికి సినీ ఇండస్ట్రీ సైతం మద్దతు తెలుపుతోంది. అయితే సినిమా టికెట్ల తగ్గింపును మాత్రం కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈక్రమంలోనే ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్ల పెంపు, ఇతర సమస్యలపై చర్చించేందుకు ఓ ప్రత్యేక కమిటీని నియమించింది. త్వరలోనే ఈ కమిటీ తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది. దీనిపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

    Also Read:  వినుకొండలో ఘనంగా ‘అఖండ’ వేడుకలు !

    కాగా ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్లో సినిమా టికెట్లను విక్రయించేందుకు వీలుగా ఇటీవల చట్టసవరణ చేసింది. టికెట్ల విక్రయ ప్లాట్ ఫాం నిర్వహణను ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు అప్పగిస్తూ ప్రభుత్వం జీవో 142ను విడుదల చేసింది. అయితే ఈ జీవోను వ్యతిరేకిస్తూ మల్టీపెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పలువురు కోర్టులో సవాలు చేశారు. దీనిపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.

    ఆన్ లైన్లో ప్రభుత్వమే టికెట్లను విక్రయిస్తే గుత్తాధిపత్యానికి దారితీస్తుందని సీనియర్ లాయర్ డి.ప్రకాశ్ రెడ్డి థియేటర్ యాజమాన్యాల తరుపున కోర్టులో వాదించారు. ఈ నిర్ణయం థియేటర్ యాజమాన్యాల హక్కులను హరించడమే అవుతుందని వాదించారు. చాలా మందికి ఆన్ లైన్ టికెట్లను బుక్ చేయడం తెలియదని వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

    ప్రభుత్వం ఆన్ లైన్ టికెటింగ్ అమలు చేస్తే తప్పేంటని ప్రశ్నించింది. ఆన్ లైన్ విధానం ద్వారా పన్ను ఎగువేతకు చెక్ పెడుతుందని పేర్కొంది సినిమా చూసే వాళ్లకు ఎలా బుక్ చేసుకోవడమే కాదు.. ఆన్ లైన్లో ఎలా చూడాలో కూడా తెలుసంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేశాక విచారిస్తామంటూ నాలుగు వారాలపాటు వాయిదా ధర్మాసనం వాయిదా వేసింది.

    Also Read: వందల కోట్లు ఉన్న నిర్మాతకు ఆర్ధిక సాయం అవసరమా జగన్ ?