https://oktelugu.com/

Nandamuri Balakrishna: వర్మ  ‘బాలయ్య షో’  పై చేసిన  ట్వీట్  ను ఎందుకు డిలీట్ చేశాడంటే.. ?

Nandamuri Balakrishna:  బాలయ్య  ‘అన్ స్టాపబుల్’ షో  ‘ఆహా’లోనే  రికార్డ్ స్థాయిలో హిట్ అయింది.  అందుకే  ఈ షోకి గెస్ట్  గా రావాలని  స్టార్లు కూడా ఆశ పడుతున్నారు. ఈ క్రమంలోనే  ఆర్జీవీ  కూడా  ఆశ పడ్డాడు.  ఆహా ఓటీటీ లో నందమూరి బాలకృష్ణ  హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ  అన్‌ స్టాపబుల్ షోకు  నన్ను పిలవాలని దర్శకుడు రాంగోపాల్ వర్మ  మొదట  ట్వీట్ చేసి,  ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో.. వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు.  […]

Written By:
  • Shiva
  • , Updated On : January 20, 2022 / 12:10 PM IST

    Ram Gopal Varma on Twitter

    Follow us on

    Nandamuri Balakrishna:  బాలయ్య  ‘అన్ స్టాపబుల్’ షో  ‘ఆహా’లోనే  రికార్డ్ స్థాయిలో హిట్ అయింది.  అందుకే  ఈ షోకి గెస్ట్  గా రావాలని  స్టార్లు కూడా ఆశ పడుతున్నారు. ఈ క్రమంలోనే  ఆర్జీవీ  కూడా  ఆశ పడ్డాడు.  ఆహా ఓటీటీ లో నందమూరి బాలకృష్ణ  హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ  అన్‌ స్టాపబుల్ షోకు  నన్ను పిలవాలని దర్శకుడు రాంగోపాల్ వర్మ  మొదట  ట్వీట్ చేసి,  ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో.. వెంటనే ఆ ట్వీట్ ను డిలీట్ చేశాడు. 

    Nandamuri Balakrishna:

     
    ఇంతకీ ఈ ఆర్జీవీ అనే వింత జీవి  ట్వీట్ లో ఏమి పోస్ట్ చేశాడు అంటే.. ‘ఈ షో ఓ రేంజ్‌లో ఉంది. అందులో నేను కూడా  పాల్గొని  మనసు విప్పి  మాట్లాడాలనుకుంటున్నాను.  అయితే,   బాలయ్య గారు  ఆ  అవకాశం నాకు ఇస్తారని ఆశిస్తున్నాను’ అని  వర్మ ట్వీట్ చేశాడు.  కాసేపటికే దాన్ని డిలీట్ చేశాడు. అప్పటికే వర్మ చేసిన ట్వీట్ చూసిన  నెటిజన్లు ప్రస్తుతం దాన్ని వైరల్ చేస్తున్నారు.  మొత్తమ్మీద ‘అన్‌స్టాపబుల్‌’కి వస్తానంటూ  వర్మ  ట్వీట్ చేయడం విశేషమే. 

    Also Read:  ఆన్ లైన్ టికెటింగ్ విధానంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

    అయితే,  ఇదే విషయం పై బాలయ్య అభిమానులు సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు.  గతంలో టీడీపీకి వ్యతిరేకంగా  వర్మ చేసిన సినిమాల విషయంలో బాలయ్య చాలా సీరియస్ గా ఉన్నాడట.  ఇలాంటి  పరిస్థితుల్లో   వర్మ, బాలయ్య షోకి వెళ్తే..  ఇక వర్మకు  దెబ్బలు గ్యారంటీ అంటూ  బాలయ్య  ఫ్యాన్స్ మెసేజ్ లు చేస్తున్నారు.  బహుశా వర్మ కూడా ఆ మెసేజ్ లు చూసి.. ఎందుకైనా మంచిది అని  చేసిన ట్వీట్ ను డిలీట్ చేసి ఉంటాడని  మళ్ళీ అదే ఫ్యాన్స్   కామెంట్స్ చేస్తున్నారు. 
    ఇక  ఇప్పుడు ఆ షోకి  మహేష్ బాబు  ముఖ్య  అతిథిగా రాబోతున్నాడు. ఆల్ రెడీ  మహేష్ తో  ఆ  ఎపిసోడ్ ను  షూట్ చేశారు.  అది త్వరలోనే స్ట్రీమ్ కానుంది. పైగా అదే చివరి ఎపిసోడ్ అని   గత కొన్ని రోజులుగా ఇదే  హాట్ టాపిక్ అయింది.  అయితే, అదే నిజం ఆహా సంస్థ కూడా క్లారిటీ ఇచ్చింది.  పైగా  ఈ ఎపిసోడ్ లో మహేష్ మనసు విప్పి మాట్లాడాడు అట.

    Also Read:  జగన్ కు తలపోటు స్టార్ట్.. రోడ్డెక్కిన ఉపాధ్యాయ సంఘాలు

    Tags