https://oktelugu.com/

Fish Hubs: హతవిధీ.. చేపల బిజినెస్ లోకి దిగిన ఏపీ సర్కార్?

Fish Hubs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపల అమ్మకానికి నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో చేపల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా స్టాళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఫిష్ ఆంధ్రా హబ్ లు ఏర్పాటు చేయనుంది. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో చేపల అమ్మకాలతో ప్రజలకు పౌష్టికాహారం అందజేయాలని భావిస్తోంది. అందుబాటులో చేపలను అమ్ముతూ వారి ఆరోగ్యాన్ని కాపాడాలని చూస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిష్ హబ్ లు ఏర్పాటు చేసి చేపలు […]

Written By:
  • Mallesh
  • , Updated On : January 9, 2022 / 03:47 PM IST
    Follow us on

    Fish Hubs: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపల అమ్మకానికి నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో చేపల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా స్టాళ్ల నిర్మాణానికి ప్రణాళికలు రచిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలతో ఫిష్ ఆంధ్రా హబ్ లు ఏర్పాటు చేయనుంది. దీంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో చేపల అమ్మకాలతో ప్రజలకు పౌష్టికాహారం అందజేయాలని భావిస్తోంది. అందుబాటులో చేపలను అమ్ముతూ వారి ఆరోగ్యాన్ని కాపాడాలని చూస్తోంది.

    Fish Hubs

    గ్రామ, వార్డు సచివాలయాల్లో ఫిష్ హబ్ లు ఏర్పాటు చేసి చేపలు విక్రయించనున్నారు. ఇప్పటికే మొబైల్ సర్వీసుల ద్వారా చేపల విక్రయాలు చేపడుతున్నారు. మున్సిపల్, పంచాయతీ, మార్కెట్ యార్డుల్లో ఫిష్ ఆంధ్రా స్టాళ్లు పెట్టుకుని చేపలను విక్రయించాలని చూస్తోంది. పోషకాహారం అందించే క్రమంల చేపల అమ్మకాలకు ప్రాధాన్యం ఇస్తోంది.

    చేపల అమ్మకాలకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. మత్స్య పరిశ్రమను ఆదుకోవాలని చూస్తోంది. అందుకే చేపల మార్కెట్లు నెలకొల్పేందుకు ముందుకు వస్తోంది. ఇప్పటికే చేపల విక్రయాలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అందరిలో హర్షం వ్యక్తమవుతోంది.

    Also Read: Secretariat employees: ఏపీ ప్రభుత్వానికి షాకిచ్చిన సచివాలయ ఉద్యోగులు

    అయితే చేపలను ఎవరితో అమ్మిస్తారు? ఉద్యోగులతోనా లేక ఫ్రాంచైజీలతోనా అనేది తేలాల్సి ఉంది. కానీ ఉద్యోగులతో అమ్మిస్తేనే ప్రయోజనం ఉంటుందనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు చివరకు చేపలు అమ్మే వారి అవతారం ఎత్తాల్సి వస్తుందేమో అనే సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

    Also Read: Chandrababu: జూనియర్ కు దూరంగా.. పవన్ కు దగ్గరగా.. మారుతున్న చంద్రబాబు సమీకరణాలు..!

    Tags