AP GOVT Key decision On SPOS: వారికి స్పెషల్ పోలీసులుగా పేరు పెట్టారు. మద్యం, సారా, ఇసుక రవాణా నియంత్రణ బాధ్యతలు అప్పగించారు. దీంతో వారు పోలీస్ ఆఫీసర్ల హోదాగా భావించి రెండేళ్లు కష్టపడి పనిచేశారు. తీరా ఇప్పుడు విధుల నుంచి తొలగించబడ్డారు. ఇప్పుడు వారి పరిస్థి అగమ్యగోచరంగా మారింది. వీధిపడ్డామని ఆవేదన వ్యక్తం చేస్తున్నా పటి్టంచుకునేవారు లేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2500 మంది మాజీ సైనికుల వ్యధ ఇది. వారికి మాయమాటలు చెప్పి నమ్మించిన ప్రభుత్వం నట్టేట ముంచింది. ఏడాదిగా వేతనాలు చెల్లించకపోగా.. సరిగ్గా ఉగాది ముందు రోజు విధుల నుంచి తొలగించింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడుపుతోంది.
అయితే మద్యం ధరలు రెట్టింపు కావడం, నచ్చిన బ్రాండ్లు దొరకకపోవడంతో మందుబాబులు పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తెప్పించుకునేవారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సారా తయారీ, తరలింపు జోరుగా సాగేది. దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఆందోళనకు గురైన ప్రభుత్వం మద్యం, సారా, ఇసుక అక్రమ రవాణాను నియంత్రించేందుకు స్సెషల్ ఎన్ ఫోర్సుమెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. ఎక్సైజ్ శాఖ నుంచే అధికారులు, సిబ్బందిని బదలాయించింది. కానీ సిబ్బంది కొరత కారణంగా స్పెషల్ ఎన్ ఫోర్సుమెంట్ విభాగం ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. దీంతో ప్రభుత్వం 2020 జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా 2500 మందిని స్పెషల్ పోలీసులను భర్తీ చేసింది. ఇందులో దాదాపు మాజీ సైనికులే అధికం.
Also Read: Russia Ukraine War: ఉక్రెయిన్ లో ప్రజల ఊచకోత.. రష్యా దారుణాలు..
వీరి వేతనం రూ.15,000గా నిర్ణయించింది. వీరు విధుల్లో చేరిన తరువాత పొరుగు రాష్ట్రాల మద్యం, సారా అక్రమ రవాణా నియంత్రణలోకి వచ్చింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయాలు పెరిగాయి. ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా పెరిగింది. అంతవరకూ బాగానే ఉంది. ప్రభుత్వానికి ఆదాయం పెరగడానికి కారణమైన స్పెషల్ పోలీసులకు ఏడాది పాటు వేతనాలు అందించిన ప్రభుత్వం తరువాత మొండిచేయి చూపింది. ఇప్పుడు ఉగాదికి ముందు వారిని ఏకంగా విధుల నుంచి తొలగించినట్టు ప్రకటించింది.
ప్రాణాలకు తెగించి విధులు
కరోనా కాలంలో వీరు కష్టపడి విధులు నిర్వహించారు. అంతర్ రాష్ట్ర, జిల్లా రహదారుల్లో, మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల వద్ద పగలూ రాత్రీ కాపలా కాశారు. మద్యం, సారా, నిషేధిత వస్తువుల రవాణాకు అడ్డుకట్ట వేశారు. కరోనా సమయంలో ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణకు భయపడిన సమయాల్లో సైతం సేవలందించారు. అంతర్ రాష్ట్ర చెక్ పోస్టుల వద్ద కొవిడ్ విధులు నిర్వర్తించారు. కానీ వీరి వేతనం రూ.15 వేలే. కనీస వేతనం కూడా అందని వీరికి ఏడాదిగా వేతనాలు చెల్లించలేదు. ఇదేమని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఏకంగా విధుల నుంచి తొలగించడంపై వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. చాలామంది ఆర్మీలో రిటైర్మెంట్ తీసుకున్న తరువాత బ్యాంకులు, ఇతర కార్పొరేట్ సంస్థల్లో సెక్యూరిటీ విభాగంలో చేరుతుంటారు. జీతం కూడా వీరికి ఎక్కువే. అటువంటి కొలువులు వదులుకొని ప్రభుత్వ ఉద్యోగంగా భావించామని.. స్పెషల్ పోలీసులు అని పేరు పెట్టడంతో గౌరవం ఉంటందని అనుకున్నామని.. కానీ కొద్దిరోజుల్లోనే తొలగిస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో అసోసియేషన్ గా ఏర్పడి పోరాటానికి సన్నద్ధమవుతున్నారు.
Also Read:Telangana TRS Leaders Joins BJP: టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి నేతలు.. ఏం జరుగుతోంది?
Web Title: Ap govt key decision on spos
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com