https://oktelugu.com/

AP Government: మోత మోగింది.. ఏపీ ప్రజలకు ప్రభుత్వం షాక్

AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తిపన్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 15 శాతం పెంచినట్లు చెబుతున్నా ఇందులో ప్రజలకు తీవ్ర నష్టం జరిగే సూచనలున్నాయి. దీనిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వ నిర్ణయంతో ఏకంగా 600 శాతం పన్ను పెరగబోతోందని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచుతుంటే ప్రజలకు నష్టం జరుగుతుందని వాపోతున్నారు. వార్షిక అద్దె విలువ ఆధారంగా కాకుండా మూలధన విలువ ఆధారంగా పన్ను పెంచడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు. చట్ట ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : September 5, 2021 / 03:07 PM IST
    Follow us on

    AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆస్తిపన్ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 15 శాతం పెంచినట్లు చెబుతున్నా ఇందులో ప్రజలకు తీవ్ర నష్టం జరిగే సూచనలున్నాయి. దీనిపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రభుత్వ నిర్ణయంతో ఏకంగా 600 శాతం పన్ను పెరగబోతోందని తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచుతుంటే ప్రజలకు నష్టం జరుగుతుందని వాపోతున్నారు. వార్షిక అద్దె విలువ ఆధారంగా కాకుండా మూలధన విలువ ఆధారంగా పన్ను పెంచడాన్ని పిటిషనర్లు ప్రశ్నించారు. చట్ట ప్రకారం కాకుండా ఇష్టారాజ్యంగా పెంచడంలో ఆంతర్యమేమిటని అడుగుతున్నారు.

    రాజ్యాంగ విరుద్దంగా పన్నులు పెంచుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ఆస్తి పన్ను పెంచడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పన్నుల విధానంలో మార్పులు చేసి ప్రజలపై భారం మోపడం సరైంది కాదని చెబుతున్నారు. పిటిషన్ ను హైకోర్టు విచారణకు చేపట్టింది. రేపు ఈ పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

    ఆస్తిపన్ను పెంపుపై జనం గందరగోళంలో పడిపోయారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చట్ట సవరణల తీర్మాణం లేకుండానే చేయడంతో ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం మాత్రం 15 శాతమే అని చెబుతున్నా ప్రజలపై పెను భారమే కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ప్రభుత్వం కూడా ఆస్తి పన్ను గురించి వ్యతిరేకతను లెక్కచేయడం లేదని సమాచారం.

    ప్రభుత్వం కూడా దీనిపై ఎలాంటి ముందుచూపు లేకుండా చేస్తుందని ప్రతిపక్షాలు సైతం ఆక్షేపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజలపై భారం మోపేందుకు నిర్ణయించుకుందని గగ్గోలు పెడుతున్నాయి. ప్రభుత్వ తీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్తి పన్నుపెంపు నిర్ణయంపై పున: సమీక్షించుకోవాలని సూచిస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. విమర్శలను సైతం లెక్కచేయడం లేదు. తన నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది.