
సత్యం కంప్యూటర్స్ కు ఆంధ్రప్రదేశ్ కు దగ్గరి పోలికలు ఉన్నాయి. సత్యం కంప్యూటర్స్ లేని ఆదాయాన్ని చూపించి అప్పులను దాచిపెట్టి దాన్నే ఆదాయంగా చూపించి తప్పుదోవ పట్టించింది. ఇతర కంపెనీల్లో పెట్టి అసంబంబద్దమైన ఆర్థిక విన్యాసాలు చేసి పతనమైంది. చివరికి ఏమి చేయలేక చేతులెత్తేసింది. దీంతో ఆ తరువాత ఏం జరిగిందనేది అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అప్పుల్లో కూరుకుపోయింది. రెండేళ్లలో ఏపీ సర్కారు ఏం చేసిందో ఏం చేయలేకపోయిందో తెలుస్తుండడంతో సత్యం సంస్థతో పోలికలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లెక్కకు మించి అప్పులు చేసింది. ఎఫ్ఆర్సీఎం చట్టానికి లోబడి అప్పులు చేయాల్సి ఉన్నా ఆ నిబంధనలు పట్టించుకోలేదు. ఫలితంగా అప్పులు చట్టవిరుద్ధంగా మారాయి. ఏపీ సర్కారు ఎఫ్ఆర్బీఎం కళ్లకు గంతలు కట్టేసింది. కార్పొరేషన్ల పేరుతో రూ.80 వేల కోట్ల అప్పులు చేసింది. వీటిని లెక్కల్లో చూపించడం లేదు. ఆర్బీఐ అడిగినా వివరాలు ఇవ్వడం లేదు. ఎఫ్ఆర్బీఎం చట్టం కింద తీసుకున్న అప్పుల్లోనూ దొంగ లెక్కలు రాశారు. తెలంగాణ తిరిగి చెల్లించిన అప్పును కూడా తాము చెల్లించినట్లుగా లెక్కలు చూపి దాదాపుగా 18 వేల కోట్లు అప్పు ఎక్కువగా తెచ్చుకున్నారు.
41 వేల కోట్ల నిధులపై విచారణలు ప్రారంభమయ్యాయి. ఆనిధులకు ఓచర్లు కూడా లేకుండా చేశారని టీడీపీ ఆరోపిస్తోంది. సర్దుబాట్లు చేశామని ప్రభుత్వం చెబుతోంది. ఇంత పెద్ద మొత్తంలో సర్దుబాట్లు చేస్తే జీతాల కోసం ఆర్బీఐ దగ్గరకు ఎందుకు వెళుతున్నారని ప్రశ్నించింది. ఉద్యోగుల వేతనాలు ఇవ్వడంలో కూడా ఎందుకు తాత్సారం వహిస్తున్నారో తెలపాలని అడుగుతున్నారు. ప్రభుత్వం సర్దుబాట్ల విషయంలో పాక్షిక నిజాలే చెబుతోందిని ఇంకేదో గూడుపుఠాణి జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థపై కాగ్ తో విచారణ చేయించాలనే డిమాండ్ వస్తోంది. గత రెండేళ్ల నుంచి అన్ని మార్గాల్లో అప్పుులు తెచ్చి దాగుడుమూతలు ఆడుతోందని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో ఆడిటింగ్ జరిపితే అసలు విషయాలు బయటపడతాయి. ఇప్పటి వరకుజరిగిన విషయాల్ని ఆరా తీస్తే సత్యం కంప్యూటర్స్ కు ఏపీ ప్రభుత్వానికి దగ్గర సంబంధాలు ఉన్నాయనే విషయం వెల్లడవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.