spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ఏపీ ఆర్థిక స్థితి.. నెలానెలా స్కీమ్‌లకు గండమే?

ఏపీ ఆర్థిక స్థితి.. నెలానెలా స్కీమ్‌లకు గండమే?

AP CM
ఏ రాష్ట్రంలో అయినా పథకాల అమలుకు నిధులు విడుదల చేస్తుంటాయి. ఇందుకోసం క్యాలెండర్‌‌ను తయారు చేసి ప్రకటిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దూసుకెళ్తోంది. దేశంలోనే టాప్‌ ప్లేస్‌లో ఉంది. జగన్ అధికారంలోకి రావడానికి ముందే ప్రజల కోసం ఏం చేస్తామో ప్రకటించేశారు. ఆయన చెప్పిన విధంగానే పేదలకు ఉపయోపడేలా నవరత్నాలను ప్రకటించేశారు. వాటి అమలును సైతం సీరియస్‌గా తీసుకున్నారు. పేదలకు లబ్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. చెప్పినట్లుగానే పథకాలను అమలు చేస్తున్నారు.

ఏపీలో ఈ ఆర్థిక సంవత్సరం పథకాల అమలు కోసం గత ఫిబ్రవరిలోనే క్యాలెండర్‌‌ను ప్రకటించారు. దాని ప్రకారం ఐదు పథకాలకు సంబంధించిన నిధులను ఈ ఏప్రిల్‌లో విడుదల చేయాలి. కానీ.. ఇప్పుడు ఏప్రిల్‌ నెల సగం పూర్తయినా ఇంకా నిధులు విడుదల కాలేదు. అయితే.. ఇందుకు నిధులు లేమి కారణంగానే తెలుస్తున్నా.. ఇంకా ఏమైనా కారణాలు కూడా ఉన్నాయా అనే ప్రశ్నలు సైతం వినిపిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక పరిస్థితి అధ్వానంగా తయారైంది. ముఖ్యంగా గత చంద్రబాబు హయాంలోనూ ఆదాయం పెద్దగా పుంజుకోలేదు. లోటు బడ్జెట్‌తోనే రాష్ట్రం నడుస్తూ ఉంది. ముందు నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇలాగే ఉంది. ఇక ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం హయాంలో కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. అసలే సంక్షేమ పథకాలతో టాప్‌ ప్లేస్‌లో ఉన్న జగన్‌ ప్రభుత్వం.. ఇప్పుడు ఆ పథకాలను ఎలా నడిపించాలో తెలియక తల పట్టుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ప్రధానంగా జగన్‌ అమలు చేస్తున్న పథకాల్లో జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన మొదటి విడత నిధులు విడుదల చేయాల్సి ఉంది. ఈ నిధుల కోసం విద్యార్థులు ఎదురుచూస్తూనే ఉన్నారు. వాటితోపాటే పొదుపు సంఘాల మహిళలకు వైఎస్సార్‌‌ సున్నా వడ్డీ చెల్లింపులు కూడా చేయాల్సి ఉంది. ఇక రైతులకు రబీకి సంబంధించిన వైఎస్సార్‌‌ సున్నా వడ్డీ డబ్బులు ఇవ్వాల్సి ఉంది. వీటిపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ప్రకటనా రాలేదు. దీనిపై ముఖ్యమంత్రి కూడా ఎప్పుడు స్పందిస్తారో తెలియకుండా ఉంది. అటు విద్యార్థులు, ఇటు మహిళలు, మరోపక్క రైతులు మాత్రం ఈ డబ్బుల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...

Balakrishna: బాలయ్య ను కలిసిన కొరటాల శివ…ఆ విషయంలో భరోసా ఇచ్చిన నటసింహం…

Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు కి రీసెంట్ గా షూటింగ్ స్పాట్లో గాయమైన విషయం మనందరికీ తెలిసిందే. తన మజిల్ కి ఇంజురీ అవ్వడం వల్ల సర్జరీ చేసిన డాక్టర్లు అతనికి...

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆ విషయంలో తేలిపోయాడు…

Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకుడు' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా తెలుగులో బాలయ్య బాబు...

Anil Ravipudi: అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా…

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను చేసి సూపర్ సక్సెస్ ని సాధించడం అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ప్రయోగాత్మకమైన సినిమాలను చేస్తే సక్సెస్ లు వచ్చే అవకాశం ఎక్కువగా...
Oktelugu Epaper
Exit mobile version