AP DGP Gowtham Sawang Transfer: ‘చలో విజయవాడ’ ఏపీ ప్రభుత్వంలో చిచ్చు పెట్టిందా? అన్ని ఆంక్షలు పెట్టినా విజయవాడను ఉద్యోగులు పోటెత్తడం ప్రభుత్వంపై ఆగ్రహానికి కారణమైంది. ఉద్యోగుల సమ్మె పోటెత్తడానికి పోలీసుల వైఫల్యమే కారణమని ప్రభుత్వం సీరియస్ కూడా అయినట్లుగా అప్పట్లో ప్రచారం జరిగింది. అప్పటి నుంచి గుర్రుగా ఉన్న ప్రభుత్వం ఏపీ డీజీపీని తాజాగా బదిలీ చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకటన పెను సంచలనమైంది. అధికార, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు పడింది. ఈయన స్థానంలో కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించారు. ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైన సంగతి తెలిసిందే.
లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకొని తమ బలాన్ని ప్రదర్శించారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. భారీగా తరలివచ్చిన ఉద్యోగులను నిలువరించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే డీజీపీ గౌతం సవాంగ్ ను బదిలీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం సాగుతోంది.
Also Read: చిన్న జీయర్ స్వామికి కేసీఆర్ తో చిక్కులు తప్పవా?
రాజేంద్రనాథ్ రెడ్డి ని డీజీపీగా నియమించారని తెలుస్తోంది… దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈరోజు సీఎం జగన్ ను చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ బదిలీ గురించి వీరు చర్చించినట్టు సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక వివరణ రావాల్సి ఉంది. అప్పటివరకూ ఈ బదిలీ సంగతి తెలియదు.
-కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఉద్యోగ ప్రస్థానం
రాజేంద్రనాథ్ రెడ్డి స్వస్థలం కడప జిల్లా రాజుపాళెం మండలం పర్లపాడు. కొన్నేళ్ల క్రితం ఆయన కుటుంబం హైదరాబాద్ లో స్థిరపడింది. రాజేంద్రనాథ్ రెడ్డి 1992 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారి. గతంలో కసిరెడ్డి విశాఖపట్నం, విజయవాడ పోలీస్ కమిషనర్ గా రాజేంద్రనాథ్ రెడ్డి పనిచేశారు. ఔషధ నియంత్రణ విభాగం అధికారిగానూ ఆయన సేవలందించారు. మరోవైపు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ జీఏడీలో రిపోర్టు చేయాలని గౌతం సవాంగ్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేవించింది. కాగా 2023 జులై వరకూ సవాంగ్ పదవీకాలం ఉన్నప్పటికీ ఈలోపే బదిలీ చేయడం చర్చనీయాంశమైంది.
Also Read: ఏపీలో మందు బాబులకు షాకిచ్చిన సీఎం జగన్