ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య 226 కి పెరిగింది. వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం శనివారం రాత్రి 10 గంటల నుంచి ఆదివారం ఉదయం వరకు 34 మందికి కరోనా పాజిటివ్ నమోదైనట్లు స్టేట్ కరోనా నోడల్ ఆఫీసర్ అర్జా శ్రీకాంత్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా గుంటూరు జిల్లాలో 30, నెల్లూరు జిల్లాలో 34, ప్రకాశం జిల్లాలో 23, కడప జిల్లాలో 23, కృష్ణా జిల్లాలో 28, పశ్చిమ గోదావరి జిల్లాలో 15, విశాఖపట్నం జిల్లాలో 15, తూర్పుగోదావరి జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 17, అనంతపురం జిల్లాలో 3, కర్నూలు జిల్లాలో 27 చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నేటికీ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు 34 నమోదై నెల్లూరు జిల్లా మొదటి స్థానంలో ఉంది. కర్నూలు జిల్లాలో రాత్రి 24 కేసులు నమోదు అవడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు.