
ప్రతిపక్షాలు ఆశ్చర్యపోయేలా నిర్ణయాలు తీసుకోవడంలో ఏపీ సీఎం జగన్ ముందుంటున్నారు. రాజధాని కూడా లేని రాష్ట్రంలో నవరత్నాలు సహా ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు చేరువ అవుతున్నారు. ముఖ్యంగా సీఎం జగన్ ప్రజారోగ్యం విషయంలో ఎక్కడా రాజీపడడం లేదు. ఈ క్రమంలోనే మరో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు.
Also Read: ఏపీలో పింఛన్ తీసుకునే వారికి జగన్ సర్కార్ శుభవార్త..?
ఇప్పటికే 108, 104లతో ప్రజలకు పెద్ద ఎత్తున వైద్యసదుపాయాలు కల్పిస్తూ దేశంలోనే సీఎం జగన్ మంచి పేరు తెచ్చుున్నారు. ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రజారోగ్యం విషయంలో కీలక ముందడుగు వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాధునిక హంగులతో ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు.దాదాపు ఏడు దశాబ్ధాల తర్వాత రాష్ట్రంలో ఆస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నట్టు వివరించారు. తాజాగా అమరావతిలో వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఆస్పత్రులలో నాడు-నేడు కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేపడుతున్న మార్పులతోపాటు కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాల ప్రస్తుత పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
మూడేళ్లలో అన్ని ఆస్పత్రుల నిర్మాణాలు పూర్తి కావాలని జగన్ అన్నారు. అంతకుముందు ఆస్పత్రిలో నాడు-నేడు కార్యక్రమంపై సీఎంకి అధికారులు వివరించారు. ఇక సీతంపేట , పార్వతీపురం, రంపచోడవరం, బుట్టాయగూడెం దోర్నాలలోని ఐటీడీఏల పరిధిలో ఏర్పాటు చేయనున్న మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులకు సంబంధించి అంచనాలు అధికారులు సిద్ధం చేశారు.
Also Read: అమరావతి కుంభకోణంలో చంద్రబాబు కుటుంబమే టార్గెటా?
రాష్ట్రవ్యాప్తంగా నిర్మించతలపెట్టిన ఆస్పత్రులు చరిత్రలో నిలిచేవిధంగా ఉండాలని జగన్ అన్నారు. అన్ని ఆస్పత్రులలో అత్యాధునిక వైద్య సదుపాయాలు ఉండాలన్న సీఎం.. నిర్మాణ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దన్నారు. ఆస్పత్రులన్నింటని కార్పొరేట్ స్థాయికి ధీటుగా నిర్మాణం సాగాలన్న సీఎం.. ఆస్పత్రుల్లో సకల సౌకర్యాలు ఉండేలా.. నిర్వహణ బాధ్యత ఏడేళ్లపాటు అప్పగించాలని సూచించారు.