https://oktelugu.com/

AP CM Jagan: ప్రస్టేషన్ లో ఏపీ సీఎం జగన్..కోపమంతా ఎమ్మెల్యేలపైనే..

AP CM Jagan: రాష్ట్రంలో ఉన్న 175 స్థానాల్లో గెలుపు మనకు అసాధ్యం కాదు. ప్రయత్నిస్తే తప్పకుండా గెలుస్తాం. విపక్ష నేత చంద్రబాబును కూడా కుప్పంలో ఓడించబోతున్నాం. మనకు అంత అనుకూలంగా ఉంది. ప్రజలు కూడా మనల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎదురుచూస్తున్నారంటూ గత మూడేళ్లుగా సీఎం జగన్ చెప్పుకొస్తున్నారు. దీంతో మనకు తిరుగులేదన్నట్టు వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేనంత ఆందోళనలో మాత్రం సీఎం జగన్ ఉన్నట్టు కనిపిస్తున్నారు. కానీ బయటకు మాత్రం […]

Written By: Dharma, Updated On : September 17, 2022 4:10 pm
Follow us on

AP CM Jagan: రాష్ట్రంలో ఉన్న 175 స్థానాల్లో గెలుపు మనకు అసాధ్యం కాదు. ప్రయత్నిస్తే తప్పకుండా గెలుస్తాం. విపక్ష నేత చంద్రబాబును కూడా కుప్పంలో ఓడించబోతున్నాం. మనకు అంత అనుకూలంగా ఉంది. ప్రజలు కూడా మనల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎదురుచూస్తున్నారంటూ గత మూడేళ్లుగా సీఎం జగన్ చెప్పుకొస్తున్నారు. దీంతో మనకు తిరుగులేదన్నట్టు వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే గతంలో ఎన్నడూ లేనంత ఆందోళనలో మాత్రం సీఎం జగన్ ఉన్నట్టు కనిపిస్తున్నారు. కానీ బయటకు మాత్రం గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. అందుకే తప్పు తన వైపు ఉంచుకోకుండా ఎమ్మెల్యేలపై నెట్టే ప్రయత్నాలు చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. తాను కష్టపడి బటన్ నొక్కుతుంటే మీరే నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఎమ్మెల్యేలను నిందించడమే పనిగా పెట్టుకున్నారు. ఇటీవల రాష్ట్రస్థాయిలో రెండు సార్లు ఎమ్మెల్యేలతో సమావేశం కావడమే కాకుండా వారికి వ్యక్తిత్వ నిపుణులతో క్లాస్ ఇప్పించారు. తానూ క్లాస్ తీసుకున్నారు. నా గ్రాఫ్ బాగుంది..మీ గ్రాఫ్ పెంచుకోండి అంటూ సుతిమెత్తగా హెచ్చిరించారు. ఈ నెల 19న మరోసారి సమావేశమై క్లాస్ తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

AP CM Jagan

AP CM Jagan

Also Read:
Prabhas: టాలీవుడ్ నెంబర్ వన్ హీరోగా ప్రభాస్… మరి పవన్, ఎన్టీఆర్, మహేష్, బన్నీ పరిస్థితి ఏంటీ?
నేతల్లో వణుకు..
అయితే అధినేతతో సమావేశమంటేనే వైసీపీ ఎమ్మెల్యేలు వణికిపోతున్నారు. వరుస క్లాస్ పీకేందుకే సీఎం ప్రయత్నిస్తున్నారు.. తప్ప తమ వెర్షన్ వినే పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం 175 నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ బాధ్యులు, సమన్వయకర్తలతో సమావేశం కానున్నారు. ఇందుకు సంబంధించి అందరికీ సమాచారం కూడా పంపించారు. అయితే ఇప్పటికే రెండుసార్లు ఇటువంటి సమావేశాలే పెట్టారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదని చెప్పారు. పనితీరు మెరుగుపరచుకోవాలని కూడా ఆదేశాలిచ్చారు. ఇప్పుడు ఎటువంటి ఆదేశాలిస్తారో.. లేకపోతే పనితీరు కనబరచకపోయిన ఎమ్మెల్యేల పేర్ల బయటపెడతారేమోనని నేతలు తెగ ఆందోళన చెందుతున్నారు.

ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్టు..
వాస్తవానికి సీఎం జగన్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం కంటే పార్టీ వ్యవహారాలనే సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు గ్రౌండ్ రిపోర్టును తెప్పించుకుంటున్నారు. ప్రజల్లోకి వెళుతుంది ఎవరు? పనిచేయని దెవరు? పార్టీ కార్యక్రమాలను సీరియస్ గా తీసుకుంటున్నావారెవరు? అటు నియోజకవర్గాల్లో పరిస్థితి ఏమిటి? అన్నది ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి వైసీపీకి వ్యూహాకర్త ప్రశాంత్: కిశోర్ కు చెందిన ఐ ప్యాక్ బృందం పనిచేస్తోంది. పీకే లేకున్నా ఆయన బృందంలోని రుషిరాజ్ పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో బలమైన సోషల్ మీడియా వింగ్ కూడా ఉంది. అయితే గతం కంటే సోషల్ మీడియా బలం తగ్గిందని సీఎం జగన్ దృష్టికి వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో కొత్త నియామకాలతో పాటు దాని బాధ్యతలను సజ్జల రామక్రిష్ణారెడ్డి కుమారుడు భార్గవరెడ్డికి జగన్ బాధ్యతలు అప్పగించారు.

Also Read: Sleeping Problems: సమయానికి నిద్ర పోకపోతే కలిగే ఇబ్బందులేంటో తెలుసా?

AP CM Jagan

AP CM Jagan

తుది హెచ్చరిక…
అయితే అటు ఐ ప్యాక్ తో పాటు ఇటు సోషల్ మీడియా వింగ్ నుంచి జగన్ ఎప్పటికప్పుడు గ్రౌండ్ రియాల్టీ పరిస్థితిని తెప్పించుకుంటున్నారు. ప్రస్తుతం 60 నుంచి 70 మంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. సోమవారం నాడు జరిగే సమీక్షలో వీరికి స్పష్టమైన హెచ్చరికలు జారీచేస్తారని తెలుస్తోంది. ఇప్పటికే రెండు సార్లు హెచ్చరించిన నేపథ్యంలో ఇక తుది హెచ్చరిక చేస్తారని తెలుస్తోంది. పనితీరు మార్చుకోకపొతే ఎమ్మెల్యేలకు పక్కలో బల్లెంలా సమన్వయకర్తలను నియమిస్తానని కూడా జగన్ హెచ్చరించనున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి సోమవారం జరిగే సమీక్ష వైసీపీలో కొంత ప్రకంపనలు రేగే సూచనలైతే మాత్రం కనిపిస్తున్నాయి.

Tags