Bumper offer to Ali and Posani: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తారో ఆయనకే తెలియదు. ఆయన మదిలో ఏముందో ఎవరికి అర్థం కాదు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తారు? ఎంతకైనా తెగిస్తారు? ఎవరినైనా అందలాలు ఎక్కిస్తారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ వారితో మంచి సంబంధాలు కొనసాగిస్తున్న ఆయన వారికి ఏదో చేయాలని చూస్తున్నారు. ఇందులో భాగంగానే వారికి పదవులు సైతం ఇవ్వాలని భావిస్తున్నారు. శుక్రవారం తనను కలిసిన మా సభ్యులకు స్పష్టమైన హామీలిచ్చారు. చిత్ర పరిశ్రమను ఆదుకుంటానని చెప్పడంతో అందరిలో హర్షం వ్యక్తమైంది.

నటులు పోసాని కృష్ణమురళి, ఆలీని తనను కలవాలని చెప్పారు. దీంతో వారికి ఏం పదవులు ఇస్తారోనని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆలీ గతంలో జరిగిన ఎన్నికల్లో గుంటూరు టికెట్ ఆశించినా అది ఇవ్వడం కుదరలేదు. దీంతో ఈసారి వారికి న్యాయం చేయాలని జగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలీకి రాజ్యసభ సభ్యుడిగా తీసుకుంటారనే ప్రచారం సాగినా అది కూడా ప్రస్తుతం సాధ్యం కాదనే విషయం తెలుస్తోంది. ఈ మేరకు ఇద్దరికి ఆహ్వానాలు అందడంతో వారికి ఏదో ఒకటి చేయాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ చిత్ర పరిశ్రమ పురోగమనానికి ప్రత్యేక చర్యలు తీసుకునే క్రమంలోనే జగన్ పోసాని, ఆలీకి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. పోసానికి సినీ సంబంధమైన పదవి ఏదైనా కట్టబెట్టాలని చూస్తున్నట్లు సమాచారం. మొదటి నుంచి వైసీపీకి పోసాని అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు చేసినప్పుడు పోసాని పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా గళం విప్పి జగన్ కు దగ్గరయ్యారు. అదే ఉద్దేశంతో పోసానికి పదవి కట్టబెట్టాలని జగన్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు హాస్య నటుడు ఆలీకి కూడా ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నా దానికి ఉన్న పోటీ నేపథ్యంలో ఆలీకి రాజ్యసభ ఇవ్వడం సాధ్యం కాని పరిస్థితి. కానీ ప్రభుత్వంలో ఏదో ఒక పదవి ఇచ్చేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఇద్దరిని సమావేశానికి రావాల్సిందిగా జగన్ ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వారితోవిడివిడిగా మాట్లాడి వారం రోజుల్లో వారికి ఏదో ఒక పదవి ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
జగన్ మదిలో వారికి ఏం పదవులు ఇవ్వాలని చూస్తున్నారో తెలియడం లేదు. కానీ చిత్ర పరిశ్రమకు ప్రస్తుతం మంచి రోజులు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పోసాని, ఆలీలకు జగన్ ఏ పదవులు కేటాయించి వారికి ప్రాధాన్యం ఇస్తారో వేచి చూడాల్సిందే.
[…] […]
[…] […]
[…] […]