CM Jagan- Kapu Community: ఏపీ సీఎం కాపులను టార్గెట్ చేసుకున్నారా? గడిచిన ఎన్నికల్లో ఆయన మాటలను నమ్మి అధికారమిచ్చిన కాపులను నట్టేట ముంచారా? వచ్చే ఎన్నికల్లో వారంతా పవన్ కళ్యాణ్ చెంతన చేరతారని ముందే గ్రహించారా? అందుకే కాపునులను అన్నివిధాలా అణగదొక్కేందుకు ప్రయత్నించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాపుల రిజర్వేషన్ల నుంచి నేటి కోనసీమ విధ్వంసం ఎపిసోడ్ వరకూ జరుగుతున్న పరిణామాలు అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఏపీలో కాపులది అగ్రస్థానం. రాష్ట్ర జనాభాలో వారి శాతం 33 శాతం పైమాటే. గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు గెలిచింది అంటే అది పూర్తిగా కాపులు ఓట్లేననడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. ఎందుకంటే రాష్ట్రంలో 70కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాపులు ఏ పార్టీకి ఓటేస్తే ఆ పార్టీ మాత్రమే అక్కడ గెలుస్తుంది. గెలుపోటములను ప్రభావితం చేసే బలీయమైన శక్తిగా కాపులు ఉన్నారు. తమ సామాజికవర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ను కాదని జగన్ వెంట కాపులు నడిచారు. కానీ వారి నమ్మకాన్ని వమ్ము చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది. పొలిటికల్ మేనియా తెలిసిన జగన్ వచ్చే ఎన్నికల నాటికి కాపులు దూరమవుతారని తెలుసు గనుక.. వారిని టార్గెట్ చేసుకుంటూ వచ్చారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అందుకు తగ్గ కారణాలను విశ్లేషిస్తున్నారు.

జగన్ అధికారంలోకి వస్తూనే కాపుల రిజర్వేషన్లపై పడ్డారు. కేంద్ర ప్రభుత్వం అగ్ర వర్ణాలకు కేటాయించిన పది శాతం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లలో 5 శాతం కాపులకు ఉండగా.. దానిని ఎత్తివేశారు. చంద్రబాబు ప్రభుత్వం.. కేంద్రం ప్రకటించిన పది శాతం ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లను కాపులకు కేటాయించిన సంగతి తెలిసిందే. విపక్షంలో ఉన్నప్పుడు రిజర్వేషన్లపై లేనిపోని హామీలిచ్చి.. చంద్రబాబు సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేసి కాపులను తనవైపు తిప్పుకున్నారు. అనక అధికారంలోకి వచ్చాక కాపుల రిజర్వేషన్ అనేది తన చేతుల్లో లేదని.. అది కేంద్రం చేతుల్లోనే ఉందని మడత పేచీ పెట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని బదానం చేసి తప్పించుకున్నారు.
Also Read: CM Jagan Delhi Tour: మోడీతో జగన్.. మధ్యలో తెలంగాణే హాట్ టాపిక్?
అడుగడగునా కాపుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు. కాపు ఉద్యమ నాయకుడు వంగవీటి రంగాను దూషించిన వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు గౌతమ్ రెడ్డికి కీలకమైన ఫైబర్ నెట్ చైర్మన్ పదవిని ఇచ్చారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలో కీలకమైన కాపు నియోజకవర్గాల్లో కాపుయేతర నాయకులను ప్రోత్సహించారు. ఒకవైపు కాపు నేతలకు పదవులిస్తూనే వారిపై ఇతర సామాజికవర్గ నేతలను ఎగదోశారు. కీలక నియోజకవర్గాల్లో కనీస ప్రాతినిధ్యం లేకుండా చేశారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేబినెట్ హోదాతో సమానంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న కొత్తపల్లి సుబ్బారాయుడ్ని వైసీపీలోకి ఆహ్వానించారు. నరసాపురం టిక్కెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. తీరా పార్టీలో చేరాక మొండి చేయి చూపారు. ఇప్పుడు అవమానకర రితీలో పార్టీ నుంచి సాగనంపారు.
రాయలసీమలో కనీస ప్రాతినిధ్యం లేకుండా చేశారు. చిన్నాచితకా పదవులతో కాపులను సరిపెట్టారు. కడప జిల్లాలో రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం కొన్ని దశాబ్దాలుగా కాపు సామాజికవర్గం చేతిలోనే ఉంది. ఏ పార్టీ తరఫున అయిన అక్కడ ఎంపీగా కాపు/బలిజ సామాజికవర్గం నేతలే ఎన్నికవుతున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ప్రతిపక్ష నేతగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రాజంపేట సీటను బలిజలకే కేటాయించారు. అయితే జగన్ దీన్ని బ్రేక్ చేశారు. 2014, 2019 ఎన్నికల్లో రాజంపేట సీటును పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి కేటాయించారు. వాస్తవానికి రాజంపేట నియోజకవర్గంలో కాపుల జ నాభా ఎక్కువ. అలాగే తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి. తిరుపతి పట్టణంలోనూ బలిజలదే ఆధిపత్యం. ఇక్కడ కూడా కాపులను కాదని జగన్ తన సామాజికవర్గానికి చెందిన భూమన కరుణాకర్ రెడ్డికి సీటు కేటాయించారు. రాజంపేట తిరుపతి మాత్రమే కాకుండా రాయలసీమలో కాపు బలిజల జనాభా ఎక్కువ ఉన్న పలు నియోజకవర్గాల్లోనూ రెడ్లకే సీట్లు ఇచ్చారు.

పెద్దల సభలో సైతం కాపులకు స్థానం కల్పించలేదు. రాజ్యసభలో వైసీపీకి ఇప్పటికే ఐదుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వీరిలో ఒక్కరు కూడా కాపు సామాజికవర్గానికి చెందినవారు లేరు. వీరు కాకుండా తాజాగా మరో నలుగురిని కూడా జగన్ తన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేశారు. వీరిలోనూ ఒక్కరు కూడా కాపు అభ్యర్థి లేకపోవడం గమనార్హం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సామాజిక న్యాయం ఒక్క జగన్ సర్కారే చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చారు.కానీ రాష్ట్రంలో అత్యధికంగా 33 శాతం ఉన్న కాపు సామాజికవర్గానికి రాజ్యసభ సీటు కేటాయించకపోవడం ఏమిటని రాజకీయ విశ్లేషకులు నిలదీస్తున్నారు.
ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా ఎనిమిదేళ్ల కిందట జనసేన ఆవిర్భవించింది. అధికార దాహంతో కాకుండా ప్రజా సమస్యలపై చిత్తశుద్ధితో పవన్ పోరాడుతున్నారు. ఆయనెప్పడూ కుల జాఢ్యం చూపించలేదు. కానీ అటువంటి వ్యక్తిపై తోటి కాపు ప్రజాప్రతినిధులతో విమర్శలు చేయించడం, వ్యక్తిగత హనానికి పాల్పడ్డారు. చివరకు కత్తి మహేష్, పోసాని క్రిష్ణమురళి, శ్రీరెడ్డి వంటి వారిపై కూడా తీవ్ర వ్యాఖ్యానాలు చేయించారు. పవన్ కల్యాణ్ పై ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పడం మానేసి ఆయన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని వైఎస్సార్సీపీ నేతలు మంత్రులు ఎమ్మెల్యేలు బూతులు తిడుతున్నారు.. ఇప్పటికీ తిడుతునే ఉన్నారు. మేము ఏదో ఒక పదవి పడేస్తాం.. దాన్ని తీసుకోవాలి.. అంతేకానీ మా రాజ్యాధికారానికి అడ్డు వచ్చేలా కాపులు పార్టీ పెట్టడం ఏమిటనే పొగరు వైసీపీ అధినేతలో కనిపిస్తోంది. ఇక సొంత మీడియా సాక్షిలో పవన్ పై వచ్చిన జుగుప్సాకర రాతలు అన్నీఇన్నీకావు. ఇక పవన్ ను పావలా అని చంద్రబాబు ప్యాకేజీకి అమ్ముడు పోయాడని నీచమైన గ్రాఫిక్సుతో సోషల్ మీడియాలో పోస్టులను పేటీఎం బ్యాచ్ తెగ వైరల్ చేస్తోంది. ఇప్పటికీ చేస్తూనే ఉంది. పవన్ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడానికి పవన్ కల్యాణ్ సినిమాలు విడుదలయినప్పుడు అట్టర్ ప్లాపు అని సోషల్ మీడియాలో ప్రచారం చేయించడం పవన్ సినిమా టికెట్ల రేట్లను ఐదు రూపాయల నుంచి 30 రూపాయలకు మించనీయకుండా చేయడం వంటివాటికి కూడా పాల్పడ్డారు. ముఖ్యంగా భీమ్లా నాయక్ విడుదలయినప్పుడు వైఎస్సార్సీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు సబ్ కలెక్టర్లు ఎంఆర్వోలు వీఆర్వోలు పోలీసులు సినిమా థియేటర్లలో చేసిన అతి అంతా ఇంతా కాదు.
సౌమ్యుడైన చిరంజీవి విషయంలో కూడా వైసీపీ తన మార్కు రాజకీయం చూపింది. సినిమా టిక్కెట్ల విషయంలో పెద్దన్న పాత్ర పోషిస్తూ సీఎం జగన్ ను కలిసే సమయంలో.. జగన్ కు చిరంజీవి చేతులెత్తి నమస్కరిస్తున్న వీడియోను సైతం ఉద్దేశపూర్వకంగా మీడియాకు విడుదల చేశారు. అదే సమయంలో చిరంజీవి మాతృమూర్తి అంజనాదేవితో పాటు కుటుంబాన్ని దూషించిన పోసాని కృష్ణమురళిని చిరంజీవి పక్కన కూర్చొబెట్టి అవమానంచారు. చిరంజీవితో సమానంగా పోసాని కృష్ణమురళికి ప్రాధాన్యమిచ్చారు. అంతటితో ఆగకుండా చిరంజీవికి వైసీపీ రాజ్యసభ స్థానం కేటాయించనుందని మీడియాలో ప్రచారం కల్పించారు. ప్రజల్లో చులకన భావం వచ్చేలా చేశారు.
Also Read: Atmakur Bypoll- JanaSena: ఆత్మకూరులో జనసేన పోటీచేస్తుందా? మద్దతిస్తుందా?
ఇటీవల కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడుతూ ఆ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన అల్లర్లు విధ్వంసంలో అన్ని కులాల పార్టీలు మతాలవారు పాల్గొన్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జగన్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా 99 శాతం కేసులను కాపు సామాజికవర్గానికి చెందిన వ్యక్తుల మీదే మోపిందని ఆరోపణలు వస్తున్నాయి. తద్వారా కాపులను సంఘ విద్రోహ శక్తులుగా ప్రజల ముందు నిలబెట్టాలనే కుట్ర ఇందులో దాగి ఉందని ఆరోపణలు వినిపిస్తున్నారు. అన్ని పార్టీల వారిని జనసేనగా చూపి కేసులు మోపడానికి ప్రయత్నిస్తోంది.
ఇక ఇటీవల బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణ ఒక కార్యక్రమంలో వైఎస్ జగన్ బాబాయి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎదుట మోకాళ్లపై కూర్చుని ఆయనకు నమస్కరించిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి చెల్లుబోయిన కులానికి చెందిన శెట్టిబలిజ సంఘాలు ఆయనను ఘెరావ్ చేశాయి. వైవీ సుబ్బారెడ్డి ఎదుట మోకాళ్లపై కూర్చుని శెట్టిబలిజల పరువు తీశారని మండిపడ్డాయి. మంత్రి అమలాపురం వస్తే ఆయన సొంత కులస్తులే చుట్టుముట్టి నిరసన వ్యక్తం చేశారు. అయితే విచిత్రంగా అమలాపురం సీఐ బాలాజీ కారణమంటూ ఆయనపై వేటు వేశారు. కాపు సామాజికవర్గానికి చెందిన బాలాజీని వీఆర్ కు పంపారు. దీనిపై కాపు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసినా జగన్ ప్రభుత్వం లెక్కచేయలేదు.
కాపులు ‘కాపు’ కాసేవారేనా? పల్లకి మోసేవారేనా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్లో జనాభాపరంగా అగ్రస్థానంలో ఉన్న కాపుల పరిస్థితి ఏమిటి? అన్నదానిపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాపులను రాజకీయాలు వినియోగించుకుంటున్నాయా? లేక కాపులే రాజకీయం చేయలేకపోతున్నారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజారాజ్యం రూపంలో కాపులకు అరుదైన అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో పవన్ రూపంలో అవకాశమిచ్చినా అందిపుచ్చుకోలేకపోయారు. ఇప్పుడు రాజకీయంగా కలబడి, నిలబడుతూ వస్తున్న పవన్ కు అండగా నిలిస్తే గ్యారెంటీగా రాజ్యాధికారం సాధించవ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మళ్లీ మాయమాటలకు నమ్ముతారో.. లేకుంటే దశాబ్దాలుగా వేచి చూస్తున్న రాజ్యాధికారాన్ని అందిపుచ్చుకుంటారో చూడాలి మరీ.
Also Read:Kothapalli Subbarayudu: కొత్తపల్లి సుబ్బారాయుడు సరే.. రాఘురామక్రిష్ణంరాజు మాటేమిటి?
Recommended Videos
[…] […]