https://oktelugu.com/

CM Chandrababu  : చంద్రబాబును కదిలించిన వీడియో.. పోలీసులపై ప్రశంసలు

సోషల్ మీడియాలో సమకాలీన అంశాలపై స్పందిస్తున్నారు సీఎం చంద్రబాబు.తాజాగా వీడియో ఆయనను కదిలించింది. వెంటనే ట్వీట్ చేశారు. అభినందనలు తెలిపారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 9, 2024 / 10:54 AM IST

    CM Chandrababu

    Follow us on

    CM Chandrababu  :  ఏపీ సీఎం చంద్రబాబు ఓ వీడియోను చూసి ఎమోషన్ అయ్యారు. ఆ వీడియో తనను ఎంతో కదిలించింది అంటూ ట్విట్ చేశారు. ఏలూరు జిల్లా పోలీసులు ఇటీవల చోరీ అయిన 251 బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. 25 మంది అనుమానితులను అరెస్టు చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు పోలీసులను అభినందించారు.అయితే నీలి అలివేణి అనే మహిళకు సంబంధించిన ద్విచక్ర వాహనాన్ని పోలీసులు అప్పగిస్తున్నప్పుడు.. ఆమె భావోద్వేగం తనను కదిలించిందని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ప్రస్తుతం చంద్రబాబు కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అదే క్రమంలో ఆ మహిళ భావోద్వేగానికి సంబంధించి వీడియో సైతం వైరల్ అంశంగా మారింది. అదే సమయంలో సీఎం చంద్రబాబు పోస్ట్ సైతం ఆసక్తి రేపుతోంది.

    * కన్న బిడ్డ మాదిరిగా ద్విచక్ర వాహనం
    ఏలూరులోని ఆర్ఆర్ పేట వాసా వారి వీధిలో నీలి అలివేణి, సత్యనారాయణ దంపతులు నివాసం ఉంటున్నారు.వారికి ఒక కుమార్తె ఉంది. ఆమె తల సేమియా వ్యాధితో బాధపడుతోంది. సత్యనారాయణ తన కుమార్తెను స్కూటీపై నెలకు రెండు సార్లు నగరంలోని తల సేమియా ఆసుపత్రికి తీసుకెళ్లేవారు.అక్కడ రక్తమార్పిడి చేయిస్తుండేవారు.ప్రస్తుతం బాధితురాలు వయసు 20 ఏళ్లు. 2021 నీట్ లో 450 ర్యాంకు సాధించింది. ఆశ్రమం కాలేజీలో ఎంబీబీఎస్ సెకండియర్ చదువుతోంది. తండ్రి సత్యనారాయణ కుమార్తెను స్కూటీపై కాలేజీకి తీసుకెళ్లడం.. తీసుకురావడం జరిగేది. దీంతో ఆ స్కూటీ కీలకంగా మారింది. దానిని కన్న బిడ్డల చూసుకునే వారు వారు. ఈ క్రమంలో గత నెల 23న ఇంటిదగ్గర ఉన్న స్కూటీని దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో వారి బాధ వర్ణనాతీతం. పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

    * భావోద్వేగానికి గురైన బాధితురాలు
    అయితే దాదాపు 251 బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి 25 మంది అనుమానితులను అరెస్టు చేశారు. పోగొట్టుకున్న బైకులను బాధితులకు తిరిగి అప్పగించారు. ఈ క్రమంలో నీలి అలివేణి కి పోలీసులు ఫోన్ చేశారు. మీ వాహనం దొరికిందని.. టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి తీసుకోండి అని చెప్పారు. హుటా హుటిన అలివేణి అక్కడకు చేరుకుంది. స్కూటీని చూడగానే తీవ్ర భావోద్వేగానికి గురైంది. తప్పిపోయిన బిడ్డ దొరికినట్లుగా స్కూటీ దగ్గరకు వెళ్లి ప్రేమగా నిమురుతూ ఒక్కసారిగా ఏడ్చేశారు ఆమె. అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియోను చూసిన సీఎం చంద్రబాబు ట్విట్ చేశారు. ఆమె భావోద్వేగం కదిలించిందని.. పోగొట్టుకున్న స్కూటీ రికవరీ చేసినందుకు ఏలూరు జిల్లా పోలీసులకు అభినందిస్తున్నాను అని చంద్రబాబు పేర్కొన్నారు.