Naatu Naatu Song Copied: ‘బాహుబలి’ సినిమా తర్వాత దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘RRR’. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్ వాయిదా వేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్ ను రాజమౌళి అదిరిపోయే రీతిలో చేస్తున్నాడు. ఈ మూవీ ‘బాహుబలి’ రికార్డులను తిరగరాయడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది.
దాదాపు మూడేళ్లపాటు ఆర్ఆర్ఆర్ మూవీని రాజమౌళికి తెరకెక్కించాడు. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అభిమానులు సైతం అంతే భారీగా ఆశలు పెట్టుకున్నారు. టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్, హలీవుడ్ చెందిన నటీనటులు, టెక్నిషిన్లు ఈ సినిమా కోసం పని చేస్తున్నారు.
ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు రాజమౌళి ‘నాటు కొట్టుడు’ అనే మాస్ బీట్ ను రిలీజ్ చేశాడు. ఈ సాంగ్ కు తగ్గట్టుగానే రాంచరణ్, ఎన్టీఆర్ లు పోటాపోటీగా డాన్స్ చేశారు. దీంతో ఈ సాంగ్ సోషల్ మీడియాలో విడుదలైన కొద్దిసేపటికే ట్రెండింగ్ లోకి దూసుకెళ్లి సరికొత్త రికార్డులను నమోదు చేసింది.
ఇదే సమయంలో దర్శకుడు రాజమౌళి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సాంగ్ కంప్లీట్ గా ఆఫ్రికన్ మూవీలోని ఓ సాంగ్ ను యాజ్ టీజ్ గా దింపినట్లు ఉంది. దీంతో ‘నాటు కొట్టుడు’ సాంగ్ కాపీనేననే తేలిపోవడంతో నెటిజన్లు ఆయనపై ట్రోలింగ్ చేస్తున్నారు. గతంలో ఆయన తీసిన ఈగ మూవీ కాక్రోచ్ అనే మూవీకి కాపీనని, బాహుబలి మూవీ పోస్టర్ ఓ ఇంగ్లీష్ మూవీని కాపీ కొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ విషయంలో రాజమౌళికి పలువురు మద్దతు ఇస్తుండగా మరికొందరు మాత్రం విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య సోషల్ మీడియాలో వాడివేడి చర్చ నడుస్తోంది. ‘నాటు నాటు’ సాంగ్ ఆర్ఆర్ఆర్ మూవీకి కావాల్సినంత ప్రచారాన్ని అందిస్తుండటంతో రాజమౌళి దీనికి పెద్దగా స్పందించడం లేదు.
మరోవైపు ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ తోపాటు నందమూరి అభిమానులు అత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ కు అదిరిపోయే టాక్ రావడంతో వారంతా హ్యపీగా ఫీలవుతున్నారు. ఈ మూవీ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చిన క్షణాల్లో వైరల్ అవుతుంది. దీంతో మూవీ కలెక్షన్లతో రీ సౌండ్ ఇవ్వడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు రేసులో నుంచి ‘గంగూబాయి’ ఔట్!
చిరంజీవి చెయ్యలేని పనిని రామ్ చరణ్ తో చేయించిన రాజమౌళి?