https://oktelugu.com/

ఏపీ కేబినెట్ విస్తరణకు తేదీ ఖరారు..

ఏపీ కేబినెట్ ఖాళీ అయిన ఇద్దరు మంత్రుల స్థానాలను భర్తీ చేసే అంశం ఇప్పుడు చర్చనీయాంగా మారింది. ఇందుకు తేదీలు ఖరాలు చేయడంలో పార్టీ నాయకుల్లో ఒకటే హడావిడి మొదలయ్యింది. ఆశావసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రమాణ స్వీకార తేదీ అధికారికంగా వెల్లడించకపోయినా ఈ నెల 22 లేక 24వ తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 22వ తేదీన సాధ్యం కాని పక్షంలో 24వ తేదీన నిర్వహించాలని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 12, 2020 8:01 pm
    Follow us on

    AP Cabinet Expansion

    ఏపీ కేబినెట్ ఖాళీ అయిన ఇద్దరు మంత్రుల స్థానాలను భర్తీ చేసే అంశం ఇప్పుడు చర్చనీయాంగా మారింది. ఇందుకు తేదీలు ఖరాలు చేయడంలో పార్టీ నాయకుల్లో ఒకటే హడావిడి మొదలయ్యింది. ఆశావసులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రమాణ స్వీకార తేదీ అధికారికంగా వెల్లడించకపోయినా ఈ నెల 22 లేక 24వ తేదీల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 22వ తేదీన సాధ్యం కాని పక్షంలో 24వ తేదీన నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.

    కేబినెట్లో మంత్రులుగా పని చేస్తున్న మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో వీరిద్దరు కొద్ది రోజుల కిందట మంత్రి పదవులకు రాజీనామా సమర్పించారు. వీరి స్థానంలో మరో ఇద్దరు కొత్త వారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లోకి తీసుకోనున్నారు. రాజ్యసభ ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి మంరతి పదవుల కోసం ఆశావహులు తమ ప్రయత్నాలు ప్రారంభించారు. పార్టీలోని ముఖ్యనాయకుల చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు.

    టీడీపీ బలాన్ని దెబ్బకొడుతున్న జగన్.

    రాజీనామా చేసిన మంత్రుల్లో మోపిదేవి వెంకట రమణ (బిసీ) గుంటూరు జిల్లాకు, పిల్లి సుభాష్ చంద్రబోస్ (ఎస్సీ) తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు. దీంతో ఆ జిల్లాల నుంచి మంత్రి పదవులు ఆశించే వారి మధ్య పోటీ నెలకొంది. ఆ సామాజిక వర్గాలకు చెందిన వారు మంత్రి పదవులకు పోటీ పడుతున్నారు. వీరి సంగతి పక్కన పెడితే ఆయా సామాజికి వర్గాలకు చెందిన ఇతర జిల్లాల సీనియర్ నాయకులు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కృష్ణా జిల్లాల బీసీ వర్గానికి నుంచి జోగి రమేష్ పేరు వినిపిస్తుండగా తూర్పు గోదావరి జిలాల నుంచి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయన వేణుగోపాల్, శ్రీకాకుళం నుంచి పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, గుంటూరు జిల్లా నుంచి విడుదల రజినిలలో ఇద్దరికి అవకాశం లభించనున్నట్లు పార్టీ వర్గాలలో ప్రచారం జరుగుతుంది.

    గుంటూరు, కృష్ణా మరికొందరు కేబినెట్ లో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ ప్రాతిపధికన మంత్రి పదవులు కేటాయిస్తారనేది ఇప్పుడు ఆశక్తికరంగా మారింది. జిల్లాల వారీగా కేటాయిస్తే ఆ జిల్లాకు చెందిన నాయకులకే అవకాశం లభించనుంది. సామాజిక వర్గాల ప్రాతిపధికన కేటాయిస్తే ఇతర జిల్లాల వారికి ఛాన్స్ లభించనుంది. మరోవైపు ఎమ్మెల్సీల నుంచి మంత్రి పదవి కోసం డిమాండ్ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాజీనామా చేసిన ఇద్ధరు నాయకులు ఎమ్మెల్సీలు గా మంత్రి పదవులు చేపట్టిన వారు కాపడంతో ఆ అవకాశం ఎమ్మెల్సీలకు ఇవ్వలనే వాదనలు వినిపిస్తున్నారు.