Homeఆంధ్రప్రదేశ్‌మా సత్తా చూపించేందుకు ఈ సమయం చాలు : సోము వీర్రాజు

మా సత్తా చూపించేందుకు ఈ సమయం చాలు : సోము వీర్రాజు

AP BJP MLC Somu Veerraju not a favourite of all

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతనాధ్యక్షుడు సోము వీర్రాజు గత కొద్ది రోజుల నుండి రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలుస్తున్నాడు. ఈ నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్ట్ సాయి తో వీర్రాజు ఇచ్చిన ఇంటర్వ్యూలో వారి పార్టీ స్టాండ్ ఏమిటి…. అసలు వారు ఏ వ్యూహంతో బరిలోకి దిగుతున్నారు అన్న విషయాలపై వివరణ ఇచ్చారు. వాటిలో మచ్చుకు కొన్ని…

బిజెపి ప్రతిపక్షంగా రాష్ట్రంలో ఎదగాలనుకుంటుందా లేదా నేరుగా అధికారపక్షం స్థానాన్నే కైవసం చేసుకోవడమే వచ్చే ఎన్నికలలో టార్గెట్ గా పెట్టుకుందా అన్న ప్రశ్నకు సోము వీర్రాజు ఎంతో నమ్మకంగా…. మేము రాష్ట్రంలో ప్రస్తుతం ప్రతిపక్షంగా వ్యవహరించాలని నిర్ణయించుకుని.. ఆ తర్వాత అధికార పక్షాన్ని ఆ స్థానం నుండి దించివేసే దిశగా అడుగులు వేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే తాము ఒక పార్టీ గా మరింత బలపడుతున్నామని… తమ వ్యూహాలు తమకు ఉన్నాయని… ఒక సంవత్సరంలో బిజెపి పార్టీ ని అందరూ మరింత గుర్తించే స్థాయికి వారు ఎదగనున్నట్లు తెలిపారు.

https://www.facebook.com/somuveerrajubjp/videos/808241173047874/

ఇక బీజేపీ రాజ్యసభ సభ్యుల్లో పార్టీ పట్ల…. రాష్ట్ర పార్టీ ప్రయోజనాల ద్వంద్వ వైఖరి ఉంది అన్న ఆరోపణలపై వీర్రాజు స్పందించారు. ద్వంద్వ వైఖరి అనేది ఏనాటికి ఉండదని…. అందరూ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకే…. ప్రజల అవసరాల మేరకే నడుచుకుంటారు కానీ భిన్నాభిప్రాయాలు అనేవి ఎక్కడైనా ఉంటాయని… పర్సనల్ అభిప్రాయాలను పక్కన పెడితే పార్టీ అంతా కలిసి తీసుకున్న స్టాండ్ కి ఎప్పుడూ వారి నేతలు మద్దతు పలుకుతూనే ఉన్నారు అని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇక రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి తమకు చాలా వ్యూహాలు ఉన్నాయని… కేవలం అతికొద్ది కాలంలోనే తమ శక్తిని నిరూపించుకుంటామని అన్నారు. ఒక సంవత్సరం తర్వాత ఏపీ బిజేపీ వేరొక లెవల్ లో ఉంటుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

జర్నలిస్టు సాయి మాట్లాడుతూ అధికార పక్షానికి 51 శాతం ఓటు బ్యాంకు… ప్రతిపక్షానికి 41 శాతం ఓటు బ్యాంకు ఉన్న దశలో బిజెపి వారు ఎవరి ఓటుబ్యాంకు ని టార్గెట్ చేస్తున్నారని అడిగారు. ప్రస్తుతం బీజేపీ ఓటు బ్యాంకు చాలా తక్కువగా ఉంది అని ఆయన గుర్తు చేసిన నేపథ్యంలో… రెండు పార్టీల నుండి తాము సమాన శాతంలో ఓట్లను కొల్లగొట్టగలమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఇంటర్వ్యూ ఆద్యంతం సోము వీర్రాజు మాటల్లోనే ఖచ్చితత్వం, ఆత్మవిశ్వాసం కొట్టొచ్చినట్లు కనపడ్డాయి. మొత్తానికి ఏపీ బీజేపీ రాష్ట్రంలో ఇప్పటికే టీడీపీని పూర్తి స్థాయిలో రూపుమార్పగా…. ఇప్పుడు వీర్రాజు మాటలతో రానున్న రోజుల్లో అనేక కొత్త వ్యూహాలతో అధికారపక్షం మీదకి వెళుతుందని అర్థమవుతుంది.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
RELATED ARTICLES

Most Popular