https://oktelugu.com/

ఇద్దరు సీఎంలు రోజూ రాత్రి అదేనట: బయటపెట్టిన బీజేపీ

తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తారా స్థాయికి చేరుతోంది. అయితే ఈ వివాదం కేవలం ఉప ఎన్నిక కోసమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తెలంగాణ, ఏపీలల్లో ఉన్న బీజేపీలు తమ ప్రాంతాల స్వప్రయోజనం కోసం మాట్లాడుతున్నా ఇద్దరు సీఎం ఆడుతున్న నాటకం అని విమర్శిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణతో ఏడేళ్ల తరువాత జలపంపకం గుర్తుకొచ్చిందా..? అని ఏపీ బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ‘రాయలసీమ నీటి ప్రాజెక్టులు అభివృద్ధి’ పేరిట ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 10, 2021 9:42 am
    Follow us on

    తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదం తారా స్థాయికి చేరుతోంది. అయితే ఈ వివాదం కేవలం ఉప ఎన్నిక కోసమేనని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తెలంగాణ, ఏపీలల్లో ఉన్న బీజేపీలు తమ ప్రాంతాల స్వప్రయోజనం కోసం మాట్లాడుతున్నా ఇద్దరు సీఎం ఆడుతున్న నాటకం అని విమర్శిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తెలంగాణతో ఏడేళ్ల తరువాత జలపంపకం గుర్తుకొచ్చిందా..? అని ఏపీ బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ‘రాయలసీమ నీటి ప్రాజెక్టులు అభివృద్ధి’ పేరిట ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
    తెలంగాణ, ఆంధ్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అన్నారు. పేదేళ్లపాటు ఉమ్మడి రాజధానికిగా ఉన్న హైదరాబాద్ వదిలివచ్చామన్నారు. ఏపీకీ వచ్చే రెవెన్యూను వదులుకున్నామన్నారు. ఇప్పుడు కృష్ణ జలాల్లోనూ ఏపీకితెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. శ్రీశైలం నుంచి నీటిని కేసీఆర్ ఆక్రమంగా వాడుకుంటున్నా ఏపీ సీఎం ఏమాత్రం స్పందించడం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ దెబ్బకు కేసీఆర్ వెనుకడుగు వేశాడన్నారు. అందుకే హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే జలవివాదాన్ని బయటికి తెచ్చారన్నారు.
    ఇక ఇద్దరు సీఎంలు పగటిపూట విమర్శలు చేసుకుంటున్నా.. రాత్రి ఫోన్లో మాట్లాడుకుంటారన్నారు. పైకి మాత్రం ఏం తెలియనట్లు కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకుంటున్నారన్నారు. నీటి సమస్యలు పరిష్కరించుకోవాడానికి ఆయా బోర్డులు ఉన్నప్పటికీ కొత్తగా వివాదాన్ని పైకి తెస్తూ సెంటిమెంట్ నుఒలకవోస్తున్నారన్నారు. 2015లో జల ఒప్పందాలపై సంతకాలు చేసి ఇప్పుడు వాటిని ఒప్పుకోబోమని తెలంగాణ సర్కార్ అనడం భావ్యం కాదన్నారు.
    ప్రజలను మభ్యపెట్టి కేంద్రానికి లేఖలు రాస్తున్న ఇద్దరు సీఎంల బాగోతాలు త్వరలో బయటపడుతాయన్నారు. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ స్పష్టమైన వైఖరితో ఒక ఉద్యమాన్ని రూపొందించామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జలవివాదంపై ప్రజలకు నిజనిజాలు తెలిపేందుకే ఈ ఉద్యమం అన్నారు. ఇద్దరు సీఎంల స్వార్థానికి రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి ప్రజలకు అన్యాయం చేస్తున్నారన్నారు.