https://oktelugu.com/

AP 3 Capitals Bill: మోడీ బాటలో జగన్.. మూడు రాజధానులపై సంచలన నిర్ణయం.. కేసీఆరే కారణమా?

AP 3 Capitals Bill: ప్రధాని మోడీ లాగే మొండిపట్టుదలతో ఉండే ఏపీ సీఎం జగన్ లో కూడా మార్పు వచ్చింది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై మోడీ వెనక్కి తగ్గినట్టే ఏపీ సీఎం జగన్ కూడా వెనక్కి తగ్గేశాడు. మోడీ ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొని సంచలనం సృష్టించాడు. ఎవరి మాట వినని మోడీ సైతం బెండ్ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మోడీ బాటలో జగన్ నడిచాడు. Also […]

Written By:
  • NARESH
  • , Updated On : November 24, 2021 12:14 pm
    Follow us on

    AP 3 Capitals Bill: ప్రధాని మోడీ లాగే మొండిపట్టుదలతో ఉండే ఏపీ సీఎం జగన్ లో కూడా మార్పు వచ్చింది. ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై మోడీ వెనక్కి తగ్గినట్టే ఏపీ సీఎం జగన్ కూడా వెనక్కి తగ్గేశాడు. మోడీ ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకొని సంచలనం సృష్టించాడు. ఎవరి మాట వినని మోడీ సైతం బెండ్ అయ్యి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు మోడీ బాటలో జగన్ నడిచాడు.

    Also Read: విశాఖపట్నమే ఏపీకి ఏకైక రాజధాని.. సంచలన నిర్ణయం దిశగా జగన్?

    Andhra-Pradesh-Will-Now-Have-Three-Capitals

    Jagan Decision on AP 3 Capitals Bill

    టీడీపీ ఆందోళన చేసినా.. అమరావతి రైతులు ఏడాదిగా రోడ్డెక్కి నిరసనలు తెలిపినా కరగని ఏపీ సీఎం జగన్ మనసు కరిగింది. మొత్తానికి హైకోర్టులో అడ్డుకుంటున్న వారికి సైతం ఊరటనిచ్చేలా మూడు రాజధానులపై సంచలన నిర్ణయం తీసుకున్నారు.

    ఏపీ మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకొని సంచలనం సృష్టించారు ఏపీ సీఎం జగన్. బిల్లును ఉపసంహరించుకుంటున్నట్టు అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. దీనిపై సీఎం జగన్ మరికాసేపట్లో అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు.

    కాగా నిన్ననే పెళ్లిలో సీఎం కేసీఆర్ ను కలిశాడు జగన్. ఆయనతో ఏకాంతంగా రహస్యంగా సమాలోచనలు జరిపారు. ఈ క్రమంలోనే సడెన్ గా ఈరోజు మూడు రాజధానులపై వెనక్కి తగ్గడం వెనుక కేసీఆర్ ప్లాన్ ఉన్నట్టు తెలిసింది. ప్రస్తుతం చంద్రబాబును ఏడిపించిన వైసీపీ ఎమ్మెల్యేలు, జగన్ పై తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో ప్రముఖుల్లో వ్యక్తమవుతోంది. దాన్ని డైవర్ట్ చేయడానికే కేసీఆర్ సూచన మేరకే జగన్ ఇలా సంచలన నిర్ణయం తీసుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. చంద్రబాబుకు సానుభూతి దక్కకుండా జగన్ ఈ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.ఈ మాస్టర్ ప్లాన్ వెనుక కేసీఆర్ మైండ్ ఉందని అంటున్నారు.

    ఇక ఏపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవడాన్ని ఇప్పటికే పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులు స్వాగతించారు. ఈ పాదయాత్రలో బీజేపీ పాల్గొంటుండడం.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు దీన్నొక ఉద్యమంగా మలచడంతో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకూడదనే జగన్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకొని అందరి నోళ్లకు తాళం వేసినట్టు తెలుస్తోంది.

    ఇక అమరావతి రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని.. ఇన్నాళ్లు అమరావతిని విమర్శించిన వాళ్లు క్షమాపణ చెప్పాలని రైతులు కోరుతున్నారు. ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.

    YouTube video player

    Also Read: ఏపీలో వరద.. సీఎం జగన్ పెళ్లిళ్లలో సరదా?