https://oktelugu.com/

Samantha: ఆ విషయంలో ఓకే చెప్పేందుకు భాష పెద్ద సమస్య కాదంటున్న సమంత

Samantha: నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత నుంచి సమంత ఫోకస్ మొత్తం తన కెరీర్​పైనే పెట్టినట్లు కనపిస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలకు ఓకే చెప్తూ.. విభిన్న పాత్రలను ఎంచుకునేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, సామ్ త్వరలోనే బాలీవుడ్​లోకి అడుగుపెట్టనున్నట్లు ఇటీవలే వార్తలు చక్కర్లు కొట్టాయి. సామ్​ చేయబోయే సినిమాకు తాప్సీ పన్ను నిర్మాతగా మారనున్నట్లు సమాచారం. ఇలా తన బాలీవుడ్​ ఎంట్రీపై వస్తోన్న కథనాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది సమంత. మంచి […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 22, 2021 / 12:26 PM IST
    Follow us on

    Samantha: నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత నుంచి సమంత ఫోకస్ మొత్తం తన కెరీర్​పైనే పెట్టినట్లు కనపిస్తోంది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలకు ఓకే చెప్తూ.. విభిన్న పాత్రలను ఎంచుకునేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. కాగా, సామ్ త్వరలోనే బాలీవుడ్​లోకి అడుగుపెట్టనున్నట్లు ఇటీవలే వార్తలు చక్కర్లు కొట్టాయి. సామ్​ చేయబోయే సినిమాకు తాప్సీ పన్ను నిర్మాతగా మారనున్నట్లు సమాచారం. ఇలా తన బాలీవుడ్​ ఎంట్రీపై వస్తోన్న కథనాలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది సమంత.

    మంచి స్క్రిప్ట్ వస్తే తప్పకుండా బాలీవుడ్​లో నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. బాలీవుడ్​లోనూ తనకు సినిమాలు చేయాలని ఆసక్తిగా ఉందని పేర్కొంది. ఓ ప్రాజెక్టు ఓకే చెప్పడానికి భాష పెద్ద సమస్య కాదంటోంది ఈ ముద్దుగుమ్మ. కథలో జీవం ఉండి.. ఆ పాత్రకు నేను సెట్​ అవుతానా?.. పాత్రకు పూర్తి న్యాయం చేయగలనా? అనే చూసుకుంటానని.. ఇలా ప్రాజెక్టుకు ఓకే చెప్పే ప్రతిసారి తనను తాను ప్రశించుకుంటానని చెప్పింది సామ్​.

    బాలీవుడ్​ దర్శకుడు రాజ్​ అండ్​ డీకే రూపొందించిన ఫ్యామిలీ మ్యాన్​ 2 వెబ్​సిరీస్​తో సమంత బాలీవుడ్​ ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సిరీస్​లో సామ్ నెగెటివ్​ రోల్​ ఉన్న పాత్రలో కనిపించి అలరించింది.  ఇటీవల శాకుంతల సినిమా షూటింగ్​ పూర్తి చేసుకున్న సమంత.. వరుసగా ఒక్కో ప్రాజెక్టును పట్టాలెక్కిస్తోంది.  మరోవైపు పుష్ప సినిమాలో ఐటెం సాంగ్​లో కనిపించనుంది. ఒక వేళ సామ్​ బాలీవుడ్​లో అడుగుపెడితే.. అక్కడ ఎలాంటి ట్రెండ్​ సృష్టిస్తుందో చూడాలి మరి.