తెలుగు ప్రజలకు మరో హెచ్చరిక

ఇప్పటికే తెలంగాణను తడిసి ముద్ద చేసిన వర్షాలు మరోసారి ప్రతాపం చూపేందుకు వస్తున్నాయి. దీంతో పలు జిల్లాలతోపాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. భారీ వరదనీరు చేరడంతో పలు ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేశారు. తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరో 3 రోజుల పాటు తెలంగాణలో భారీవర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. […]

Written By: NARESH, Updated On : July 25, 2021 6:52 pm
Follow us on

ఇప్పటికే తెలంగాణను తడిసి ముద్ద చేసిన వర్షాలు మరోసారి ప్రతాపం చూపేందుకు వస్తున్నాయి. దీంతో పలు జిల్లాలతోపాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలెర్ట్ జారీ చేశారు. భారీ వరదనీరు చేరడంతో పలు ప్రాజెక్టుల గేట్లను అధికారులు ఎత్తివేశారు.

తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మరో 3 రోజుల పాటు తెలంగాణలో భారీవర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే వర్షాలతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాలతోపాటు మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ జారీ చేసింది.

ఇక భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి తలపిస్తోంది. ఏకంగా 48.30 అడుగులతో భారీగా నీరు ప్రవహిస్తోంది. అధికారులు భద్రాచలంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం పెరిగే అవకాశముందని అధికారులు అంచనావేశారు. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు కూడా భారీగా వరదనీరు చేరింది.

ఎగువన వర్షాల వల్ల భారీగా వరద వస్తున్నది. దీంతో 41 గేట్లు ఎత్తి స్పిల్ వే ద్వారా దిగువకు నీటిని అధికారులు విడుదల చేశారు. ఈనెల 28న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాబోయే ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.