ఇప్పటికే కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ఇప్పుడిప్పుడే ఆ మహమ్మారి నుంచి ప్రజలు కోలుకుంటున్నారు. ఆ గండం నుంచి ఒక్కొక్కరుగా తేరుకుంటున్నారు. కానీ.. మరో కొత్త రకం వైరస్ ఇప్పుడు కలవరపెడుతోంది. ఈ వైరస్ కూడా అడ్డూఅదుపు లేకుండా ప్రబలుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం తాజాగా హెచ్చరించింది.
Also Read: అదేపనిగా వెక్కిళ్లు వస్తున్నాయా.. ఆ వ్యాధే అంటున్న వైద్యులు…?
దీంతో బ్రిటన్‌లో మరోసారి లాక్‌డౌన్ అమలు చేశారు. పలు ప్రాంతాల్లో కఠిన నిబంధనలతో ఈ లాక్‌డౌన్ అమల్లోకి తెచ్చారు. దీంతో నెదర్లాండ్స్, బెల్జియం తదితర ఐరోపా దేశాలు కూడా అలర్ట్ అయ్యాయి. బ్రిటన్ నుంచి విమాన సర్వీసులను నిలిపివేశాయి. ఇప్పటికే బ్రిటన్ నుంచి విమాన సర్వీసులను నిలిపివేశాయి. మరోవైపు భారత్ కూడా కొత్త రకం వైరస్ వ్యాప్తిని నివారించేందుకు సన్నద్ధమైంది.
Also Read: భారత్ లో కోటి మార్క్ దాటేసిన కరోనా.. యాక్టివ్ కేసులెన్నీ?
ఇదిలా ఉండగా.. కొత్త రకం కరోనా వైరస్ ప్రస్తుతమున్న వైరస్ కంటే ఎక్కువ ప్రాణాంతకమని తేల్చి చెప్పే ఆధారలేవీ లేవని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. వైరస్ ప్రభావ తీవ్రతను నిర్ధారించే దిశగా తమ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థను కూడా అప్రమత్తం చేశామన్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
మరోవైపు కొత్తరకం వైరస్ వ్యాప్తితో బ్రిటన్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హ్యాంకాక్ తెలిపారు. ప్రధానంగా దక్షిణ ఇంగ్లాండ్‌లో తాజా వైరస్ ఎక్కువగా ప్రబలుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరులోనే తొలిసారిగా నూతన రకం కరోనా వైరస్ వ్యాప్తిని ఓ రోగిలో శాస్త్రవేత్తలు గుర్తించినట్లు తెలుస్తోంది. బ్రిటన్‌లో కొత్త రకం వైరస్‌తో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తన పరిధిలోని సంయుక్త పర్యవేక్షణ బృందం అత్యవసనర భేటీని ఏర్పాటు చేసింది.