Vanama Raghava: ‘వనమా’ దొరికాడిలా.. రామకృష్ణ ఫ్యామిలీ ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్

Vanama Raghava: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు. పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ ఆత్మహత్యకు ముందర రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో రాఘవేంద్రరావుపై సంచలన ఆరోపణలు చేశారు. తన సమస్యలు పరిష్కరించాలంటే తన భార్యను పంపించాలని రాఘవేంద్రరావు అన్నాడని రామకృష్ణ ఆరోపించాడు. కాగా, ఈ సంచలన విషయం వెలుగులోకి రావడానికి సెల్ఫీ వీడియోనే కారణం. కాగా, ఈ సెల్ఫీ వీడియోను బాహ్య ప్రపంచానికి అంతటికీ […]

Written By: Mallesh, Updated On : January 11, 2022 12:56 pm
Follow us on

Vanama Raghava: కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తనయుడు రాఘవేంద్రరావు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు అరెస్టు చేశారు. పాల్వంచకు చెందిన నాగ రామకృష్ణ ఆత్మహత్యకు ముందర రికార్డు చేసిన సెల్ఫీ వీడియోలో రాఘవేంద్రరావుపై సంచలన ఆరోపణలు చేశారు. తన సమస్యలు పరిష్కరించాలంటే తన భార్యను పంపించాలని రాఘవేంద్రరావు అన్నాడని రామకృష్ణ ఆరోపించాడు. కాగా, ఈ సంచలన విషయం వెలుగులోకి రావడానికి సెల్ఫీ వీడియోనే కారణం. కాగా, ఈ సెల్ఫీ వీడియోను బాహ్య ప్రపంచానికి అంతటికీ తెలిపేందుకుగాను నాగరామకృష్ణ తన స్నేహితుడి సహకారం తీసుకున్నాడు.

Vanama Raghava

సూసైడ్ చేసుకోవడానికి ముందర తాను రికార్డు చేయబోతున్న సెల్ఫీ వీడియోకు సంబంధించి నాగ రామకృష్ణ వాయిస్ మెసేజ్ పంపాడు. అలా స్నేహితుడు ఇచ్చిన వివరాల ఆధారంగానే తము మరిన్ని ఆధారాలను కలెక్ట్ చేసినట్లు పోలీసులు వివరించారు.

సంచలనం రేపిన పాల్వంచ నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యకు సంబంధించి మరో ట్విస్టెడ్ విషయం ఇలా వెలుగులోకి వచ్చింది. తను సూసైడ్ కు ముందర వీడియో రికార్డు చేసిన విషయాన్ని తన స్నేహితుడికి వాయిస్ మెసేజ్ లో ఇలా పంపాడు. తాను ఒక వీడియో చేసి పెట్టానని, అది తన కార్ డ్యాష్ బోర్డులో ఉందని, కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత ఫోన్ అన్ లాక్ (7474) చేసీ చూసి, అందరికీ పంపాలని చెప్పాడు. కారు తాళాన్ని బాత్ రూంపైన పెట్టానని, ఈ విషయం నీకు మాత్రమే చెప్తున్నానని, ఓకే అని నాగ రామకృష్ణ తన స్నేహితుడికి వాయిస్ మెసేజ్ పంపాడు. అనంతరం తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Also Read: ఒక్కొక్కరు ఒక్కో నయీమ్… నియోజకవర్గం సామంత రాజ్యం

అలా ఈ వివరాలన్నిటినీ ఏడు పేజీల రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. తను , తన కుటుంబం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం వనమా రాఘవేనని లేఖలో తెలిపాడు నాగరామకృష్ణ, తన తల్లి, సోదరి కూడా ఈ మేరకు తెలిపారు. రామకృష్ణ బావమరిది ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేశారు. రామకృష్ణ తన స్నేహితుడు ఫోన్ కు పంపిన ఆడియో మెసేజ్ ఆధారంగా కీలక ఆధారాలను సేకరించారు పోలీసులు.

అలా మొత్తంగా పోలీసులు మృతుడి కారులోని ఒక పేజీ ఆత్మహత్య లెటర్, అప్పుల తాలూకు కాగితాలు స్వాధీనం చేసుకున్నారు. 34 నిమిషాల సెల్ఫీ వీడియోను కలిగిన ఫోన్ ను సీజ్ చేశారు. ఈ కేసులో ఏ2గా ఉన్న కొత్తగూడం ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవ బాధితుడిని బెదరించిన ఆధారాలనూ సేకరించారు. ఈ క్రమంలోనే రాఘవకు బెయిల్ లభిస్తే తనకున్న రాజకీయ పలుకుబడితో కేసును నీరుగార్చే ప్రమాదముందని రిమాండ్ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. న్యాయస్థానానికి ఈ మేరకు నివేదికలు సమర్పించారు పోలీసులు.

Also Read: వనమా రాఘవ తీరు.. టీఆర్ఎస్ బేజారు.. ఏం చేయనుంది?

Tags