మరో మెట్టు ఎక్కిన ఎంపీ రాజు..! ఇంత ధైర్యం ఎక్కడిది?

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు…. అధికార వైసీపీ పార్టీ పై తన పగని అంతా చల్లార్చుకుంటున్నాడు. జగన్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని.. పార్టీ నేతల నుండి తనకు సరైన సహకారం అందడం లేదని మొదట్లో విమర్శలు చేసిన ఆయన ప్రస్తుతం వైసీపీని విమర్శించేందుకు ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా అందరిని ఒక ఆట ఆడుకుంటున్నాడు. అయితే ఇప్పటి వరకు కృష్ణంరాజు ఏ నేతని నేరుగా ఉద్దేశించి పెద్దగా విమర్శలు చేసింది లేదు. అయితే ప్రస్తుతం పీక్ స్టేజ్ […]

Written By: Navya, Updated On : August 22, 2020 9:32 pm
Follow us on

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు…. అధికార వైసీపీ పార్టీ పై తన పగని అంతా చల్లార్చుకుంటున్నాడు. జగన్ తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని.. పార్టీ నేతల నుండి తనకు సరైన సహకారం అందడం లేదని మొదట్లో విమర్శలు చేసిన ఆయన ప్రస్తుతం వైసీపీని విమర్శించేందుకు ఏ అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా అందరిని ఒక ఆట ఆడుకుంటున్నాడు. అయితే ఇప్పటి వరకు కృష్ణంరాజు ఏ నేతని నేరుగా ఉద్దేశించి పెద్దగా విమర్శలు చేసింది లేదు. అయితే ప్రస్తుతం పీక్ స్టేజ్ లో ఉన్న కృష్ణంరాజు రెబలిజం…. ఏపీ మంత్రి కి సింపుల్ గా ఒక సవాల్ విసిరేలా చేసింది. దానితో ఆ వైసీపీ మంత్రి హడలిపోయారు కూడా.

ఏపీ మంత్రి వెల్లంపల్లి కి రఘురామరాజు ఒక సవాలు విసిరారు. తనను ఉద్దేశించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగుండదు అని హెచ్చరిస్తూ…. మాటలతో కాదు దమ్ముంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నరసాపురం నియోజకవర్గం లోకి వచ్చి వినాయక చవితి పూజలు చేయాలని వార్నింగ్ ఇచ్చారు. మంత్రి వెల్లంపల్లి కి సవాల్ విసిరి రఘు రామరాజు చాలా పెద్ద డేరింగ్ స్టెప్ వేశాడనే చెప్పాలి. ఇప్పటి వరకు జగన్ జోలికి గాని అతని నేతలు జోలికి వెళ్లని రామరాజు నెమ్మదిగా ఇలా ఒక్కో నేతలను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తే ప్రజల్లో వారి పై వ్యతిరేక భావం ఏర్పడే ప్రమాదం ఉంది

నిజానికి రఘురామరాజు అంత ధైర్యం చేయడానికి సగం కారణం అతని వ్యక్తిత్వం అయితే మిగతా సగం వైసీపీ నేతలే. ముందు రఘురామని పనికిమాలిన నాయకుడిగా అభివర్ణిస్తూ ఢిల్లీలో కూర్చుని హిందూమతంపై సవతి ప్రేమ చూపిస్తున్నారని… వెల్లంపల్లి విమర్శించారు. దీంతో రెబల్ ఎంపీకి ఆగ్రహం నషాళానికంటింది. ఢిల్లీలో రాకుండా తనపై విమర్శలు చేయడం తగదని…. వెల్లంపల్లి ని ఉద్దేశించి ప్రజల ప్రాణాలని బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.

అంతకుముందు హైదరాబాద్ లో కూర్చున్న చంద్రబాబు మార్గదర్శకంలో ఢిల్లీ లో కూర్చున్న రఘురామ పనిచేస్తున్నారని వెల్లంపల్లి విమర్శించారు. ఇక ఈ విషయాన్ని పక్కన పెడితే వినాయకచవితి కూడా అయిపోయింది.. కానీ రఘురామరాజు జోరు మాత్రం తగ్గడం లేదు. వైసిపి వారు సత్వరమే అతని విషయమై ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే నష్టం మాత్రం భారీగా ఉంటుందని విశ్లేషకుల అంచనా.