https://oktelugu.com/

Amaravathi Issue: ఏపీ సర్కారుకు మరోషాక్.. అమరావతి రైతులకు ఊరట..!

Amaravathi Issue: ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పాలనలో ఆయన తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రత్యర్థి పార్టీలు కోర్టులను ఆశ్రయిస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం తరుఫు న్యాయవాదులు తమ వాదనలు కోర్టుల్లో బలంగా విన్పిస్తున్నారు.. అయితే ప్రత్యర్థుల వాదనల ముందు ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు తేలిపోతున్నారు. దీంతో జగన్ సర్కారుకు ప్రతీసారి న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగలడం కామన్ గా మారిపోయింది. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 13, 2021 / 03:12 PM IST
    Follow us on

    Amaravathi Issue: ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్మోహన్ రెడ్డికి న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. పాలనలో ఆయన తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రత్యర్థి పార్టీలు కోర్టులను ఆశ్రయిస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం తరుఫు న్యాయవాదులు తమ వాదనలు కోర్టుల్లో బలంగా విన్పిస్తున్నారు.. అయితే ప్రత్యర్థుల వాదనల ముందు ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు తేలిపోతున్నారు. దీంతో జగన్ సర్కారుకు ప్రతీసారి న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు తగలడం కామన్ గా మారిపోయింది. తాజాగా మరోసారి ఏపీ హైకోర్టు.. జగన్ సర్కారుకు షాకివ్వడం చర్చనీయాంశంగా మారింది.

    వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే అమరావతి భూముల్లో ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తోంది. నాడు అధికారంలో ఉన్న మంత్రులు, పార్టీ నేతలు అమరావతిలోనే రాజధాని వస్తుందని ముందస్తు సమాచారంతో పెద్దఎత్తున అక్కడ భూములను కొనుగోలు చేసారని టాక్ ఉంది. మరోవైపు అసైన్డ్ భూముల వ్యవహారంలోనూ లబ్ధిదారులను ప్రభుత్వం మోసం చేసిందని వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తోంది. ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ వ్యవహారంపై విచారణ చేయించి నాటి ప్రభుత్వం ఇన్ సైడర్ ట్రేడింగ్ చేసిందని చర్యలకు పూనుకుంది.

    గత చంద్రబాబు ప్రభుత్వం.. రాజధాని కోసం భూములిచ్చిన అసైన్డ్ రైతుల కోసం జోవో నెంబర్ 41 ను విడుదల చేసింది. అసైన్డ్ భూముల వారికి స్పెషల్ ప్యాకేజి విధానంలో భాగంగా స్థలాలు కేటాయిందని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ప్రభుత్వం అసైన్డ్ రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లను వెనక్కు తీసుకుంటూ గతంలో నోటీసులు జారీ చేసింది. దీనిపై ఏపీ సర్కారు అసైన్డ్ రైతుల భూముల క్రయ విక్రయాలకు సంబంధించి జారీ చేసిన జీవో నెంబర్ 316 జారీ చేసింది. ఈ జీవోను న్యాయవాది ఇంద్రనీల్ బాబు హైకోర్టులో సవాలు చేశారు.

    దీనిపై హైకోర్టులో నేడు వాదనలు జరిగాయి. నోటీసులు ఇవ్వకుండా కేటాయించిన ప్లాట్‌లను రద్దు చేసేందుకు ఏపీ సర్కారు ఈ జీవో ఇచ్చారని ఇంద్రనీల్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం వైపు వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ చర్యలను సమర్ధించలేదు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ లేదని స్పష్టం చేసింది.ఈమేరకు అసైన్డ్ భూముల విషయంలోనూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టేటస్ కో అమలు చేయాలంటూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. తదనంతర ప్రక్రియ చేపట్టొద్దని ఏఎమ్ఆర్డీఏకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

    ఇప్పటికే అమరావతి విషయంలో జగన్ సర్కారుకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నారు. జగన్ సర్కారు తీసుకొచ్చిన మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి రైతులు ఉద్యమాలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఏపీ హైకోర్టు తాజాగా అమరావతిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరుగలేదని తేల్చిచెప్పడం వైసీపీకి మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేలా కన్పిస్తుంది. దీంతో జగన్ సర్కారు అమరావతి అసైన్డ్ భూముల విషయంలో ఎలా ముందుకెళుతుందనేది ఆసక్తికరంగా మారింది.