AP Survey: ఏపీలో మరో సంచలన సర్వే వెల్లడైంది. ఎన్నికల సమీపిస్తున్న కొలది సర్వేలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు కాండ్రేగుల ప్రసాద్ తాజాగా ఓ సర్వేను వెల్లడించారు. తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు నేపథ్యంలో.. ఏ పార్టీ విజేతగా నిలవనున్నది అన్నది నియోజకవర్గాల వారీగా ఫలితాలను వెల్లడించారు. గత ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొన్న సంగతి తెలిసిందే. అటు వైసిపి, ఇటు టిడిపి, జనసేన ఓట్లను లెక్కించి మరి ఫలితాలను వెల్లడించడం విశేషం. ప్రస్తుతం ఈ సర్వే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈనెల 19న ఈ సర్వే వెల్లడయ్యింది
గత ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయం సాధించింది. టిడిపి 23 స్థానాలకే పరిమితమైంది. జనసేనకు ఒకే ఒక స్థానం దక్కింది. అయితే ఈసారి వైసిపి గణనీయమైన సీట్లు పోగొట్టుకోనుంది. 34 స్థానాలకే పరిమితం కానుందని స్పష్టమైంది. తెలుగుదేశం,జనసేనకూటమి 141 స్థానాల్లో ఘన విజయం సాధించనుందని సర్వే తేల్చడం విశేషం. కూటమి స్పష్టమైన మెజారిటీ దిశగా దూసుకెళ్తోంది.
ఉత్తరాంధ్రలో 34 స్థానాలకు గాను వైసిపి కేవలం ఆరు స్థానాలకే పరిమితం కానున్నట్లు తేలింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో సైతం ఈసారి వైసీపీ పట్టు కోల్పోనుందని స్పష్టమైంది. ప్రధానంగా కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వైసిపి మెరుగైన ఫలితాలను సాధించనుంది. ఉభయగోదావరి, కోస్తా జిల్లాల్లో నష్టం తప్పదని తేలింది.తెలుగుదేశం, జనసేన కూటమి గెలుపొందనున్న సీట్లలో భారీ మెజారిటీ కనిపిస్తోంది. అదే వైసిపి గెలిచే చోట్ల అత్తెసరు మెజారిటీ రానుంది. 5000 లోపు మెజారిటీ రానున్నట్లు ఈ సర్వే తేల్చింది.
పాలకొండ, కురుపాం, చీపురుపల్లి, వి. మాడుగుల, అరకు, పాయకరావుపేట, పెద్దాపురం, అనపర్తి, రంపచోడవరం, గోపాలపురం, గుడివాడ, పామర్రు, దర్శి, మార్కాపురం, గిద్దలూరు, గూడూరు, రాజంపేట, కడప, రాయచోటి, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదకూరు, పాణ్యం, పత్తికొండ, కోడుమూరు, ఆలూరు, సింగనమల, చంద్రగిరి, సత్యవేడు, గంగాధర నెల్లూరు, చిత్తూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో మాత్రమే వైసిపి గెలిచే ఛాన్స్ ఉంది. అయితే ఇందులో కూడా 500 నుంచి 1000 మెజారిటీ సాధించే సీట్లు పది వరకు ఉన్నాయి. ఈ రెండు నెలల్లో టిడిపి, జనసేన కూటమి పుంజుకుంటే ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఏపీలో టిడిపి, జనసేన కూటమి ప్రభంజనం సృష్టించిన తేలడంతో ఆ రెండు పార్టీల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. వైసీపీకి కలవరపాటుకు గురిచేస్తోంది.