TS Election Results 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మరో సంచలనం నమోదు కాబోతోంది. ఈ ఎన్నికల్లో కుటుంబ సభ్యులకు చాలా తక్కువగా టికెట్లు దక్కాకి. బీఆర్‌ఎస్ నుంచి మామ, అల్లుడు మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి టికెట్లు దక్కించుకున్నారు. మేడ్చల్ నుంచి మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి నుంచి మర్రి రాజశేఖరరెడ్డి పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ నుంచి తండ్రి, కొండుకు మైనంపల్లి హన్మంతరావు, మైనంపల్లి రోహిత్‌రావు పోటీ చేస్తున్నారు. మైనంపల్లి హన్మతరావు మల్కాజ్‌గిరి నుంచి రోహిత్‌రావు మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే భార్య భర్తలు, సీనియర్ నాయకులు అయిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉత్తమ్ పద్మావతి పోటీ చేస్తున్నారు. హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఆయన భార్య ఉత్తమ్ పద్మావతి కోదాడ నుంచి బరిలో ఉన్నారు.
గెలుపు బాటలో భార్య, భర్తలు..
హుజూర్‌నగర్, కోదాడ నుంచి పోటీ చేస్తున్న దంపతులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉత్తమ్ పద్మావతి ఈ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యంతో గెలుపు బాటలో పయనిస్తున్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భారీ ఆధిక్యం సాధిస్తానని చాలెంజ్ చేశారు. అలాగే ఆయన ఆధిక్యం కనబరుస్తున్నారు. తన భార్యను కూడా మంచి బెజారిటీతో గెలిపిస్తున్నారు.
మామ, అల్లుడు..
ఇక మామా, అల్లుడు చేమకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి పోటీ చేస్తున్న మేడ్చల్, మల్కాజ్‌గిరిలో ఇద్దరూ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అయితే ఇద్దరి మెజారిటీ స్వల్పంగా ఉంది. మూడు, నాలుగు రౌండ్ల పోలింగ్ మాత్రమే పూర్తయింది. మిగతా రౌండ్లలో ఫలితాలు మారే అవకాశం కూడా ఉంది.
తండ్రి వెనుకంజ.. కొడుకు ముందంజ…
ఇక తండ్రి, కొడుకు మైనంపల్లి హన్మంతరావు, రోహిత్‌రావు పోటీ చేసప్తున్న మల్కాజ్‌గిరి, మెదక్‌లో భిన్నమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. మల్కాజ్‌గిరిలో హన్మంతరావు వెనుకపడ్డారు. ఇక మెదక్‌లో మాత్రం కొడుకు రోహిత్‌రావు గెలుపు దిశగా పయనిస్తున్నారు. కొడుకు కోసమే హన్మంతరావు బీఆర్‌ఎస్‌ను వీడారు. కాంగ్రెస్‌లో చేరి ఇద్దరూ టికెట్ దక్కించుకున్నారు. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.
మిథున్ వెనుకంజ..
ఇక మహబూబ్‌నగర్ టికెట్ తన కొడుకు ఇవ్వాలని జితేందర్‌రెడ్డి తన టిఇకెట్ త్యాగం చేశారు. ఇందుకు బీజేపీ మద్దతు తెలిపి. జితేందర్‌రెడ్డి కొడుకు మిథున్‌రెడ్డికి టికెట్ ఇచ్చింది. ఇక్కడ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ బీఆర్‌ఎస్ నుంచి బరిలో ఉన్నారు. కానీ, ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి బరిలో ఉన్నారు. ఆయనను బీజేపీ సస్పెండ్ చేసింది. దీంతో ఆయన కాంగ్రెస్ టికెట్‌పై పోటీ చేస్తున్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్, బీజేపీని వెనక్కునెట్టి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆధిక్యం కనబరుస్తున్నారు.