https://oktelugu.com/

Margadarsi Case: సో వాట్.. రామోజీరావు అయితే భయపడాలా? మార్గదర్శి పై జగన్ ముందుకే..

Margadarsi Case: రామోజీరావు… పచ్చళ్ళు, పేపర్, చిట్ ఫండ్స్.. ఇలా మూడు డిఫరెంట్ కాంబినేషన్ల వ్యాపారాలతో ఏకంగా సౌత్ ఇండియా మీడియా మొఘల్ గా ప్రసిద్ధి చెందాడు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి.. ఇలాంటి ఎందరో ముఖ్యమంత్రులను తన రాతలతో ఒక ఆటాడించాడు.. తన పేరు తలచుకుంటేనే భయపడే పరిస్థితి కల్పించాడు. ఆ చంద్రబాబు నాయుడు ఈయన ఫోల్డ్ లో వ్యక్తి కాబట్టి.. అవ్యాజమైన ప్రేమ కురిపించాడు..కురిపిస్తూనే […]

Written By:
  • NARESH
  • , Updated On : March 29, 2023 / 01:35 PM IST
    Follow us on

    Margadarsi Case

    Margadarsi Case: రామోజీరావు… పచ్చళ్ళు, పేపర్, చిట్ ఫండ్స్.. ఇలా మూడు డిఫరెంట్ కాంబినేషన్ల వ్యాపారాలతో ఏకంగా సౌత్ ఇండియా మీడియా మొఘల్ గా ప్రసిద్ధి చెందాడు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కాసు బ్రహ్మానంద రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి.. ఇలాంటి ఎందరో ముఖ్యమంత్రులను తన రాతలతో ఒక ఆటాడించాడు.. తన పేరు తలచుకుంటేనే భయపడే పరిస్థితి కల్పించాడు. ఆ చంద్రబాబు నాయుడు ఈయన ఫోల్డ్ లో వ్యక్తి కాబట్టి.. అవ్యాజమైన ప్రేమ కురిపించాడు..కురిపిస్తూనే ఉన్నాడు. కానీ ఇప్పుడు రామోజీరావు వెనక్కి తిరిగి చూసే పరిస్థితి కల్పించాడు జగన్ మోహన్ రెడ్డి.

    వాస్తవానికి మార్గదర్శి విషయంలో రామోజీరావును గెలికింది వైయస్ రాజశేఖర్ రెడ్డి.. దీనిని మరింత రచ్చ రచ్చ చేసింది ఉండవల్లి అరుణ్ కుమార్. అయితే అప్పట్లో రిలయన్స్ సహకారం అందించడంతో రామోజీరావు మార్గదర్శి వివాదం నుంచి తాత్కాలికంగా బయటపడ్డాడు. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ వివాదాన్ని వదిలిపెట్టలేదు. ఇదే క్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఏకంగా హైకోర్టులో పిటిషన్ వేశాడు.. దీనిపై విచారణ జరుగుతుండగానే వైయస్ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం చెందాడు. ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా పనిచేసిన రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ఈ వివాదం గురించి పట్టించుకోలేదు.. ఈలోపు రాష్ట్రం విడిపోవడంతో రామోజీరావుకు కూడా పెద్దగా ఇబ్బంది కలగలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ ముఖ్యమంత్రి కావడంతో మార్గదర్శి వివాదం మళ్లీ తెరపైకి వస్తుందని అందరూ భావించారు.. కానీ యాదృచ్ఛికంగా రామోజీరావు వద్దకు జగన్ మోహన్ రెడ్డి వెళ్ళాడు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. కానీ తర్వాత ఏమైందో తెలియదు కానీ మార్గదర్శి వివాదాన్ని జగన్ మళ్ళీ తెరపైకి తీసుకొచ్చాడు. ఆంధ్రప్రదేశ్ తరఫున తను ఇంప్లీడ్ అయ్యాడు. “రామోజీ ఫిలిం సిటీని వెయ్యి నాగళ్ళ తో దున్నుతా” అని చెప్పిన చంద్రశేఖర రావు.. అధికారంలోకి వచ్చిన తర్వాత మార్గదర్శి కేసు విషయంలో ఇంప్లీడ్ కాలేదు.

    జగన్ ఇంప్లీడ్ అయిన తర్వాత మార్గదర్శి కేసులో విచారణ వేగం పుంజుకుంది. ఈ క్రమంలోనే ఏపీ సిఐడి అధికారులు మార్గదర్శి శాఖల మీద దాడులు ముమ్మరం చేశారు. పలు శాఖలకు చెందిన బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేశారు. అంతేకాకుండా పలు శాఖల్లో కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం మొత్తం జరుగుతుండగానే రామోజీరావు కోర్టును ఆశ్రయించారు.. అయితే విచారణను వాయిదా వేసిన కోర్టు.. ఏపీ సిఐడి దర్యాప్తును మాత్రం అడ్డుకునే ఆదేశం ఇవ్వలేదు. ఇది జరుగుతుండగానే సిఐడి మరో అడుగు ముందుకు వేసింది.. కోటికి వెళ్లి అనుమతి తీసుకొని మార్గదర్శి విషయంలో మరింత దూకుడుగా వెళ్లాలని నిర్ణయించింది.

    Margadarsi Case

    మార్గదర్శి చిట్‌ఫండ్‌ కేసులో చైర్మన్‌ రామోజీరావుకు సీఐడీ నోటీసు జారీచేసింది. ఆయన కోడలు మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌కు సైతం గుంటూరు సీఐడీ అధికారులు తాఖీదులు ఇచ్చారు. సీఆర్‌పీసీ 160కింద ఇచ్చిన ఈ నోటీసుల్లో ఈ నెల 29 లేదా 31న గానీ… ఏప్రిల్‌ 3లేదా 6న గానీ విచారణకు రావాలని కోరారు. గుంటూరు సీఐడీ కార్యాలయానికి రావడానికి కుదరకపోతే తామే రామోజీ ఇంటికి వచ్చేందుకు దర్యాప్తు అధికారులు ఆ నోటీసుల్లో సంసిద్ధత వ్యక్తంచేశారు. గత ఏడాది అక్టోబరు, నవంబరు నెలల్లో మార్గదర్శి కార్యాలయాలపై స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. పలు జిల్లాల అసిస్టెంట్‌ రిజిస్ట్రార్ల నుంచి అందిన ఫిర్యాదుల మేరకు మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థపై సీఐడీ కేసు నమోదు చేసింది.

    ఇదిలాఉండగా, ఇటీవల విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురం తదితర ప్రాంతాల్లోని మార్గదర్శి కార్యాలయాలు, మేనేజర్ల ఇళ్లపై సోదాలు నిర్వహించి, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. పలువురు మేనేజర్లను అరెస్టు చేశారు. ఈ క్రమంలో తాజాగా రామోజీరావు, శైలజా కిరణ్‌లకు సీఐడీ… నోటీసులు పంపించింది.